ప్రజావాణికి నిర్లక్షంగా – ఆలస్యంగా వస్తున్న వివిధ శాఖల అధికారులు
ప్రజావాణిలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్న దృశ్యం
జోగులాంబ గద్వాల28 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : అయిజ. మండల కేంద్రంలో ప్రతి సోమవారం ఎంపీడీవో కార్యాలయం నందు నిర్వహించే మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి కొన్ని శాఖల అధికారులు సమయపాలన పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహించాల్సి ఉండగా, కొందరు అధికారులు ప్రారంభ సమయానికి హాజరుకాకుండా ఆలస్యంగా వస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. దీంతో తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నిర్ణీత సమయానికి హాజరై ప్రజల సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.