ఎన్ హెచ్ -44 పై ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా
జోగులాంబ గద్వాల 28 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ప్రైవేటు పాఠశాలకు చెందిన 37 మంది విద్యార్థులు, హైదరాబాద్ లోని wonder la విహారయాత్రకు తిరిగి వస్తుండగా సోమవారం ఉదయం జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు మండలం బోరవెల్లి శివారులోని జాతీయ రహదారిపై బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. గాయపడిన విద్యార్థులను అలంపూర్ చౌరస్తాలోని 100 పడకల ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.