ప్రజలారా తస్మాత్ జాగ్రత్త 

Aug 3, 2024 - 20:52
 0  2
ప్రజలారా తస్మాత్ జాగ్రత్త 

తక్కువ పెట్టుబడి.. ఎక్కువ వడ్డీల వైపు చూడొద్దు..

గమనించండి.. చూడండి.. తెలుసుకోండి..

విచారణ చేపట్టిన పోలీసులు..

జోగులాంబ  గద్వాల జిల్లా: అయిజ పట్టణంలో  తహశీల్ధార్ ఆఫీస్ కు కూత వేటు దూరంలో..  PVT LTD పేరుమీద గుజరాత్ రాష్ట్రానికి చెందిన  25 సంవత్సరాల యువకుడు రియల్ ఎస్టేట్  కంపెనీ అని హంగు ఆర్భాటలతో అయిజలోని కొంతమంది బడా బాబుల వ్యక్తుల  సహకారంతో.. అడ్రస్ ద్వారా ఆఫీస్ ను పెట్టి అతి తక్కువ రోజులలో ప్రజల నుంచి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు.. కేవలం 3 నెలల వ్యవధిలో 25 నుంచి 50 కోట్లకు పైగా వసూలు చేసారని  గుసగుసలు..  ప్రజల నుండి ఆ కంపెనీలో  పెట్టుబడుల పై తిరస్కరించిన వారి నుంచి సమాచారం సేకరించగా..

ఒక లక్ష రూపాయలు జమ చేస్తే ప్రతి నెల 40వేల రూపాయలు 5 నెలల పాటు ఇస్తారు..(40 రూపాయల వడ్డీ చొప్పున) ..

10 లక్షలు రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నెలకు 4లక్షలు ఇవ్వడం ఐదు నెలలపాటు.. షూరిటీ లేకుండా అలా ఇస్తారు.. 

10లక్షలు పెట్టుబడి పెట్టె కస్టమర్ షూరిటీ కావాలంటే కస్టమర్కు పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇస్తూ
అయిజ పట్టణానికి సుదూర ప్రాంతంలో ఉన్న ప్లాట్ ను తక్కువ ధరలో ఉన్న రిజిస్ట్రేషన్ చేస్తా మంటారు..  అందుకు కంపెనీ ప్రతి నెల4లక్షలు జమ అయ్యే చెక్కు లను పెట్టిబడి పెట్టిన వారికి తీరిగి ఇస్తారు.. పెట్టుబడి పెట్టె వారిని తీసుకు వస్తే వారికి కూడా కమిషన్ ఇస్తామంటారు కంపెనీ ప్రతినిధులు..

ప్రస్తుతం ఈజీ మనీకి అలవాటు పడినవారు పెట్టుబడును పెడుతున్నారు... వారి నుండి కస్టమర్లను చేర్పించే ప్రయత్నం చేస్తున్నారూ... 

ఇక్కడే కొసమెరుపు.. గడువు తీరిన తర్వాత ఇస్తారనే గ్యారంటీ లేదు.. ఈ మధ్యనే కర్ణాటక రాష్ట్రం లోని రాయచూరు లో ధర్వేష్ కంపెనీ ద్వారా డబ్బులు ఎక్కువ వస్తాయని భారీగా అక్కడి ప్రజలు పెద్ద మొత్తం లో పెట్టుబడులు పెట్టగా దాదాపు 500 కోట్ల రూపాయల తో బోర్డ్ తిప్పేసిన వైనం.. పేద, మధ్యతరగతి ప్రజలంతా రూ.10,000 నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టిన డబ్బు ఆసక్తిని రేకెత్తించిందని పోలీసు వర్గాలు తెలిపాయి. కంపెనీలో 10 వేల మందికి పైగా పెట్టుబడులు పెట్టారని.. నిందితులను అరెస్టు చేసిన తర్వాతే మోసం విషయం పూర్తిగా వెలుగులోకి వచ్చింది..

ఇప్పటివరకు రాయచూరులో ఏడు మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.. ఈ సంఘటనను తీవ్రత దృష్ట్యా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీఈడీకి బదిలీ చేసింది..

అలాంటి సంఘటనలు మన అయిజ ప్రాంతంలో జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి.. రాయచూరు జిల్లాలో జరిగిన సంఘటనలను మరువకముందే.. సరిహద్దు ప్రాంతమైన అయిజ లో  తక్కువ రోజులలో ఎక్కవ లాభాలు వస్తాయని కొంతమంది వ్యాపారస్తులు ఇప్పటికే భారీగా పెట్టుబడి పెట్టి లాభాలు అర్జించినట్లు   ఎక్కడైనా పదిమంది గుమ్మి కూడిన ఇదే చర్చ.. వారి ద్వారా మరింత మంది పెట్టుబడి పెట్టెలోపు ఆ కంపెనీ పై సమగ్ర విచారణ జరిపి ప్రజలు మోసపోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.. ఇందులో బడా బడా వ్యాపారస్తులు ముందస్తుగా పెట్టుబడి పెట్టి ముందస్తు లాభాలు అర్జించి.. చివరకు బలయేది మధ్యతరగతి కుటుంబాల  మాత్రమే.. వారి అవసరాలను ఆసరాగా చేసుకుని మధ్యతరగతి కుటుంబాల భవిష్యత్తును నాశనం చేసే ఇలాంటి కంపెనీలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిఐడి దర్యాప్తు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.. సరిహద్దు ప్రాంతాల్ని టార్గెట్ చేస్తున్నారు.. పెట్టుబడులు పెట్టిన వారు ఇప్పటివరకు బయటకు రాకపోవడం కొసమెరుపు.. దీనిబట్టి బడా బడా వ్యాపారస్తులే పెట్టుబడులు పెట్టారని.. సామాన్యులు లేకపోవడంతో కొంత ఉపశమనంగా భావించవచ్చని ఆ నోట ఈ నోట చర్చలు కొనసాగుతున్నాయి..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333