పోరాటయోధుడు పండగ సాయన్న..

Aug 8, 2026 - 18:01
Aug 8, 2026 - 18:03
 0  2
పోరాటయోధుడు పండగ సాయన్న..

భూస్వాములకు రజాకర్లకు వ్యతిరేకంగా చేసిన పోరాటం మర్చిపోలేనిది..

ఆయన స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం

నేరేడుచర్లమండలందిర్శించర్ల లో పండగ సాయన్న జయంతి

సూర్యాపేట 09 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- సాయన్న జయంతి సందర్బంగా బిఆర్ యస్ హుజుర్నగర్ నియోజకవర్గం బిఆర్ యస్ నాయకులు రాపోలు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో మాట్లాడుతూ నిజాం రజాకర్లకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి పేద ప్రజల కడుపు నింపిన పోరాటయోధుడు పండగ సాయన్న అని ఈ పేద ప్రజలు ఆకలితో అలమటించకూడదని భూస్వాముల నుంచి ఆహార ధాన్యాలు దోచి పేద ప్రజల కడుపు నింపిన మహనీయుడని కొనియాడారు. ఆకలితో అల్లాడుతున్న గ్రామాలలో పండగ సాయన్న  అడుగు పెడితే  వారి కడుపు నింపి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిన ఘనత వల్లే సాయన్న కు పండగ సాయన్న పేరు వచ్చిందన్నారు. ముదిరాజ్ కులంలో పుట్టిన ఈ మహానీయుడు బంధుక్ ఎత్తి రజాకర్ల అన్యాయాలను ఎదిరించి ఎదురొడ్డి నిలిచి బహుజనాలకు అండగా నిలిచాడని గుర్తు చేశారు. అలాంటి మహావీరుడు స్ఫూర్తితో భవిష్యత్తు తరాలు పోరాటాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో పల్లెపంగు నాగరాజు నేరేడుచర్ల మండల NMR ముదిరాజ్ యువసేన అధ్యక్షులు పంగ బుచ్చిబాబు తకెళ్ళ నాగార్జున షేక్ నాగుల్ మీరా కొప్పు గౌతమ్ గౌడ్ తురక వెంకటేశ్వర్లు జొన్నలగడ్డ రాం నర్సయ్య పటని వెంకటయ్య నాగరాజు పంగ శ్రీను తురక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333