పేద కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ ఎంతో ఆసరా

Aug 30, 2026 - 20:58
Aug 30, 2026 - 22:48
 0  3
పేద కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ ఎంతో ఆసరా

తిరుమలగిరి 31 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామానికి చెందిన ఆకుల వేణుకు మంజూరైన CMRF చెక్ ను లబ్ధిదారుడికి అందించిన  తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకరి జనార్ధన్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతోమంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెలిశాల గ్రామ సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్, ఉపసర్పంచ్ వెంకటమ్మ, లింగయ్య, తిరుమలగిరి మున్సిపాలిటీ  7వ వార్డు కౌన్సిలర్ బత్తుల శ్రీను మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనడం జరిగింది.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి