పేదల దేవుడు ఎన్టీఆర్ 

Jan 18, 2026 - 19:46
 0  5
పేదల దేవుడు ఎన్టీఆర్ 

టిడిపి మండల పార్టీ అధ్యక్షులు బానోతు నాగేశ్వరావు నాయక్ 

ఎన్టీఆర్ పేదల దేవుడు అని ఆయన ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని టిడిపి మఠంపల్లి మండల పార్టీ అధ్యక్షులు బానోతు నాగేశ్వరావు నాయక్  అన్నారు.  ఆదివారం ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. సినీ రంగంలో నెంబర్ వన్ గా,  రాజకీయ రంగంలో నెంబర్ వన్ గా రాణించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ మాత్రమే నని అన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం , మండల వ్యవస్థ ఏర్పాటు చేయడం , మహిళలకు ఆస్తిలో సమాన హక్కు చట్టాన్ని తీసుకురావడం లాంటి ప్రజా రంజకమైన పాలన అందించి తిరుగులేని నాయకుడిగా ఎన్టీరామారావు కీర్థించబడ్డాడన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ మండల నాయకులు భాష్యం నవీన్ యాదవ్  ఎస్టీ సెల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు బానోత్ వెంకట్రాం నాయక్ రాయిరాల లింగయ్యభాష్యం నవీన్, రాయి రా లింగయ్య,, కొర్లపాటి అమరయ్య, ఐతం గోపి, టిడిపి సీనియర్ నాయకులు భూక్య రవి నాయక్  తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333