పేదరికాన్ని జయించి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన చిరంజీవి

నాగారం 25 నవంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
నాగారం మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన కీ,శే: పేరాల సోమనర్శయ్య - బాలమ్మ రెండవ కుమారుడు పేరాల చిరంజీవి చదువుకి అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించాడు అట్టడుగు వర్గానికి చెందిన చిరంజీవి ఎన్నో కష్టాలు పడ్డాడు తల్లి తండ్రి వ్యవసాయం మరియు కూలీ పని చేసే వారు హైదరాబాద్ జేఎన్టీయూ వునివర్సిటి లో ఎంటెక్ పూర్తీ చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేశాడు 10 సంవత్సరాల నుండి ఎన్నో ప్రయత్నాలు చేసినా రాలేదు ఇటీవలే ప్రకటించిన ఉద్యోగాలలో ఎట్టకేలకు అదృష్టం వరించింది ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించాడు, కుటుంబసభ్యులు మరియు బంధువులు గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు