పెట్రోలు పోసుకున్న రైతు కుటుంబం

ధాన్యం కొనుగోలు కేంద్రంలో పెట్రోల్ పోసుకొని రైతుదంపతులుఆత్మహత్యాయత్నం
ధాన్యం బాగాలేదని వెనక్కి పంపిన మిల్లు యజమాన్యం
మనస్థాపంతో కొనుగోలు కేంద్రం వద్ద రైతుదొ దంపతులు ఆత్మహత్యకు ప్రయత్నం తహసిల్దార్ చొరవతో సద్దుమణిగిన అభివాదం
వెళ్లిన ధాన్యం లోడు వెనక్కి వచ్చిన లారీ
రైతుల తో మాట్లాడిన తహసిల్దార్ దయానందం
తుంగతుర్తి 25 నవంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్ :
ఒంటిపై పెట్రోల్ పోసుకొని రైతు దంపతులు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆత్మహత్యయత్నం చేసుకున్న సంఘటన మద్దిరాల మండల పరిధిలోని అన్నారం గ్రామంలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద శనివారం చోటుచేసుకుంది వివరాల్లోకెళ్తే మద్దిరాల మండలం
చౌళ్ల తండకు చెందిన రైతు ధాన్యాన్ని తెచ్చి ధాన్యం కొనుగోలు నిర్వాహకులు తేమశాతం చూసి మరి కొంతమంది రైతుల ధాన్యాన్ని కూడా కాంట్రావెసి లారీలో కోదాడలోని వెంకటరమణ ట్రేడర్ మిల్లుకు ఈనెల 17న పంపించారు అయితే తాలు అధికంగా ఉందని మిల్లు దిగుమతి చేసుకోలేదు దీంతో రైతు వెళ్లి మాట్లాడగా కింటాకు 7 కిలోల తరుగు తీస్తే దిగుమతి చేసుకుంటామని మిల్లర్లు చెప్పగా రైతులు ఒప్పుకోలేదు దీంతో మిల్లర్లు ధాన్యానికి వెనక్కి పంపించగా మనస్థాపానికి గురైన రైతు భీమా నాయక్ అతని భార్య పున్నమతో కలిసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా అక్కడ ఉన్న రైతులు పెట్రోల్ బాటిల్ నీ లాక్కొని విషయానికి తెలుసుకున్న తహశీల్దార్ యానంద్ కొనుగోలు కేంద్ర వద్దకు వచ్చి రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు ధాన్యం లారీ మరో మిల్లుకు పంపిస్తామని భరోసా ఇచ్చారు కొనుగోలు కేంద్రంలో ఏజెన్సీ తొలగించి బాధ్యతలు ఇతరులకు అప్పగిస్తున్నట్టు తెలిపారు వారి వెంట ఏపిఎం కొమ్ము రాంబాబు సీసీ గడ్డం యాదగిరి రైతులు పాల్గొన్నారు