పెన్షన్ పెంచాలని ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి

Sep 15, 2025 - 19:33
 0  4

అడ్డగూడూరు15 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–  యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంను మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సూరారం రాజు ఆధ్వర్యంలో ముట్టడి చేశారు.అనంతరం ఎమ్మార్వో శేషగిరిరావుకు వినతిపత్రం అందజేశారు.ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సూరారం రాజు మాట్లాడుతూ..వికలాంగుల పెన్షన్ రూ.6వేల పెంచాలి.వృద్దులు వితంతువులు ఒంటరి మహిళలు,నేత,గీత,బీడీ కార్మికులతో పాటు ఇతర పెన్షన్ దారులకు రూ.4వేల పెన్షన్ పెంచాలి.ఇప్పటికే నూతన పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ మంజూరు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ రూ 4వేల నుండి రూ 6వేలు పెంచుతామని,వృద్ధులు వితంతువులతో పాటు ఇతర పెన్షన్ దారుల పెన్షన్లు రూ 2000/-నుండి రూ 4000/- పెంచుతామని హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాగ్దానం చేశారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టి 22 నెలలు గడిచినా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచలేదు.ఇది ఘోరమైన మోసం. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ వికలాంగులు, వృద్ధులు వితంతువులతో పాటు ఇతర పెన్షన్ దారులకు ఏ మాత్రం సరిపోవడం లేదు. దీని వల్ల వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుత పెన్షన్ వల్ల నెల రోజుల పాటు పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యంగా జీవించే పరిస్థితి కూడా లేదు. అంగవైకల్యం, నిస్సహాయ స్థితి, నిరాదరణ వల్ల ఇప్పటికే ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొంటున్న వికలాంగులు, వృద్ధులు, వితంతువులతో పాటు ఇతర పెన్షన్ దారుల యొక్క దీన పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరుతున్నాం.కనీసం సరియైన తిండి తినడానికి కూడా సరిపోని పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదని గుర్తు చేస్తున్నాం. అని అన్నారు.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం చేయూత పెన్షన్లు పెంచాలని"పద్మశ్రీ"మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో చేయూత పెన్షన్ దారుల బృందం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లురు లక్ష్మన్ కుమార్ ను కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి పెన్షన్ పెంచేలా చూడాలని వారిని కోరడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం నుండి ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు..పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులకు 6000 వృద్ధులకు వితంతులతో పాటు వివిధ పెన్షన్ దారులకు 4000 పూర్తిస్థాయి వైకిల్యం కలిగిన వారికి 15000 పెన్షన్ ఇస్తున్నారు.కానీ తెలంగాణలో పెన్షన్ పెరగకపోవడం వల్ల పెన్షన్ దారులు మాత్రం అన్యాయానికి గురవుతున్నారు.ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వికలాంగులకు 6వేల పెన్షన్ వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు,గీత,బీడీ కార్మికులతో పాటు ఇతర చేయుట పెంచినదారులకు పెన్షన్ 4వేల పెంచాలని మరియు పూర్తి కండరాలు క్షీణిత కలిగిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వలే నెలకు 15వేలు పింఛన్ ఇవ్వాలని వివిధ సంఘ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సూరారం రాజు ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు బాలేoల నరేష్,రవి,ఎమ్మార్పీఎస్ కళాకారుల సంఘం మండల అధ్యక్షుడు బాలెoల పరశురాములు వికలాంగుల మండల ప్రధాన కార్యదర్శి పనుమటి సైదులు, చిన్నపాక వెంకటయ్య, వృద్ధులు తీపిరెడ్డి సోమిరెడ్డి, లబ్ధిదారులు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333