పెట్రోల్, డీజిల్, గ్యాస్, రైతుల ఎరువుల ధరలు తగ్గించాలి

Aug 14, 2026 - 20:29
 0  1

అవినీతి అణిచివేత విద్వేష కేంద్ర బీజేపీ పాలన పోవాలి
--సిపిఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు 

సెప్టెంబర్ 1న చలో ఢిల్లీకి వేలాదిగా తరలిరండి: సీపీఐ

 జోగులాంబ గద్వాల 14 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార పాదయాత్ర కార్యక్రమం గద్వాల జిల్లా కేంద్రంలో ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం వైఎస్సార్ సర్కిల్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి బి. ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచుతున్న ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు రైతులకు అవసరమైన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టి ప్రజలపై భారాన్ని తగ్గించాలని, రైతులకు అందుబాటులో ఎరువులు అందించాలని కోరారు. *అవినీతి అణిచివేత విద్వేష కేంద్ర బీజేపీ పాలన పోవాలి*మతతత్వ విధానాలు, రాజకీయాలను విడనాడాలని, దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా, కార్మిక, రైతు, యువజన సమస్యల పరిష్కారం కోసం సీపీఐ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని బి. ఆంజనేయులు తెలిపారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమానికి కార్మికులు, రైతులు, యువత, మహిళలు, ప్రజలు వేలాదిగా తరలిరావాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి జి రంగన్న పిలుపునిచ్చారు. ధరల పెరుగుదలను అరికట్టే వరకు, రైతులు–కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపే వరకు సీపీఐ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్న, జిల్లా అధ్యక్షుడు భరత్, సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యుడు నాగార్జున, ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు రాజు, అమాలి సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, సిపిఐ మండల కార్యదర్శినాగరాజు , సహాయ కార్యదర్శి వెంకటేష్,నాయకులు ఆంజనేయులు మండల అధ్యక్షులు మస్తాన్ ,వెంకట రాములు, లారీ హమాలి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు, నారాయణ, బైక్ బైక్ రిక్షా సంఘం అధ్యక్షుడు ధర్మన్న కార్యదర్శి తిమ్మప్ప, నాయకులు ఆటో యూనియన్ నాయకులు మద్దిలేటి రఫీ, హాస్పిటల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పరుష, తదితరులు వందమంది దాకా పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333