సత్వర పరిష్కారానికి మండల స్థాయిలోనే ప్రజావాణి

Aug 14, 2026 - 20:30
Aug 15, 2026 - 04:28
 0  12
సత్వర పరిష్కారానికి మండల స్థాయిలోనే ప్రజావాణి

ఇటిక్యాల ఎంపీడీవో రమాదేవి.

 జోగులాంబ గద్వాల 14 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు  ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు మండల స్థాయిలోనే ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ప్రతి సోమవారము ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నంఒంటిగంట వరకు వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రమాదేవి తెలియజేశారు. ఎంపీడీవో రమాదేవి మాట్లాడుతూ ప్రజా సమస్యలను అక్కడికక్కడే  వేగవంతంగా  పరిష్కరించేందుకు తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి వ్యవస్థను మండల స్థాయికి విస్తరించిందన్నారు.  ఇందువల్ల ప్రజలకు  ప్రయాణ భారంతో పాటు సమయం, ఖర్చు ఆదా అవుతాయన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ  శాఖల మండల అధికారులు తప్పకుండా హాజరుకావాలని అధికారులు ఆమె కోరారు.  మండలంలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండలంలోని ప్రజలను ఆమె కోరారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State