పూలే అంబేద్కర్ జన జాతర సభను విజయవంతం చేయాలి
కెవిపిఎస్ మండల నాయకులు బాణాల ఎల్లయ్య

మరిపెడ 26 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ ఆధ్వర్యంలో పూలే అంబేద్కర్ జన జాతర సభను విజయవంతం చేయాలని కెవిపిఎస్ మండల నాయకులు బాణాల ఎల్లయ్య అన్నారు. మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపూడి గ్రామంలో జన జాతర సభ ఆహ్వాన పత్రాలను ఆయన ఆవిష్కరించారు.పూలే అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి కెవిపిఎస్ కృషి చేస్తుందని తెలిపారు.ఏప్రిల్ మాసంలో మహనీయుల జయంతుల జయప్రదంలో భాగంగా జనం జాతర సభను ఆదివారం మహబూబాద్ పత్తిపాక రోడ్డులోని ఐఎంఏ హాలులో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ గడ్డం కృష్ణ,మహబూబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పొలిటికల్ సైన్స్ లెక్చరర్స్ ధర్మారపు ఫిరోజ్ గణేష్,కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు సాదుల శ్రీనివాస్,రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఏర్పుల వీరస్వామి,మహబూబాబాద్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సువర్ణపు సోమయ్య,కేవీపీఎస్ అధ్యక్షులు చీపిరి యాకయ్య, జిల్లా కార్యదర్శి దుద్దెల రామ్మూర్తి, తదితరులు పాల్గొని ప్రసంగిస్తారని ఎల్లయ్య వివరించారు.కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి సూరబోయిన ఉప్పలయ్య,సిపిఐ(ఎం)గ్రామశాఖ కార్యదర్శి బోడపట్ల రాజశేఖర్,కేవిపీఏఎస్ నాయకులు వడ్లకొండ గంగరాజు, తదితరులు పాల్గొన్నారు.