పురపాలక ఎన్నికల భద్రత కట్టుదిట్టం: ఎస్పీ టి. శ్రీనివాసరావు
జోగులాంబ గద్వాల 6 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి ; గద్వాల్ జిల్లాలో పురపాలక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు తెలిపారు. అక్రమ నగదు, మద్యం తరలింపును అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా 4 చెక్‌పోస్టులు, 10 ప్రత్యేక బృందాలను (4 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 6 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్) ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గద్వాల్, అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీలపై ప్రత్యేక నిఘా ఉంచామని, వాహన తనిఖీలను ముమ్మరం చేశామని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.