జాతీయ పకృతి వ్యవసాయ మిషన్ కార్యక్రమం రైతులకు అవగాహన కార్యక్రమం

Feb 6, 2026 - 19:41
 0  3
జాతీయ పకృతి వ్యవసాయ మిషన్ కార్యక్రమం రైతులకు అవగాహన కార్యక్రమం
జాతీయ పకృతి వ్యవసాయ మిషన్ కార్యక్రమం రైతులకు అవగాహన కార్యక్రమం

 జోగులాంబ గద్వాల 6 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల జాతీయ ప్రకృతి వ్యవసాయం మిషన్ ,  కృషి సఖి లకు 5 రోజుల శిక్షణలో భాగంగా 4 వ రోజు, శిక్షణ పొందుతున్న మహిళలకు నౌరోజీ  క్యాంపులోని ఎం నాగేశ్వరరావు  ప్రకృతి వ్యవసాయం క్షేత్ర సందర్శన, మరియు ఉప్పల ప్రహ్లాద రెడ్డి సమీకృత వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శన నిర్వహించడం జరిగినది.
ఇందులో భాగంగా కృషి సఖిలకు ప్రకృతి వ్యవసాయం లోని వివిధ కషాయాలు తయారీ, ఉపయోగ విధానం మరియు వాటి ఆవశ్యకత ను వివరించడం జరిగినది. అదేవిధంగా నాగేశ్వరరావు పొలంలో అవలంబిస్తున్న 5 అంచల పంటల పెంపకం మరియు ప్రకృతి విధానంలో పండిస్తున్న మామిడి, కూరగాయలు మరియు వరి పంటలలో అవలంబిస్తున్న సాగు విధానము వివరించడం జరిగింది. ప్రహ్లాద రెడ్డి. ప్రహ్లాద రెడ్డి ఆయిల్ పామ్ తోటలో అవలంబిస్తున్న సమీకృత వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయం అనుబంధంగా గొర్రెలు, కోళ్లు మరియు చేపల పెంపకం విధానం అందులో మెలకువలను గురించి వివరించడం జరిగింది. ఈ ఈ కార్యక్రమంలో అల్లంపూర్ వ్యవసాయ సహాయ సంచాలకులు సక్రియ నాయక్, సాంకేతిక వ్యవసాయ అధికారులు సుబ్బారెడ్డి మరియు శ్రీలత, ఆత్మ సిబ్బంది శ్రీకాంత్ సిఎస్ఎ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఉపేందర్, సిఎస్ ఏ సిబ్బంది వీరబాబు ఐజ ఎఫ్ పి ఓ సభ్యులు పాల్గొనడం జరిగినది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333