పిడుగుపాటు ఘటనల్లో మృతి చెందిన 8 కుటుంబాలకు రూ.6 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా సాయం విడుదల

Jul 17, 2026 - 19:40
 0  1
పిడుగుపాటు ఘటనల్లో మృతి చెందిన 8 కుటుంబాలకు రూ.6 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా సాయం విడుదల

జోగులాంబ గద్వాల, జూలై 17: జిల్లాలో పిడుగుపాటు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో రూ. 6 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  జిల్లాలో పిడుగుపాటు ఘటనల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా సహాయాన్ని సంబంధిత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఈనెల 13వ తేదీన ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్ ద్వారా వారి ఖాతాలకు నేరుగా జమ చేసినట్లు  తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, బాధితులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిబంధనల మేరకు ఎక్స్‌గ్రేషియా సాయాన్ని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మల్దకల్ మండలం గార్లపాడు గ్రామానికి చెందిన బి. నవీన్ కుమార్‌, రాజోలి మండలం రాజోలి గ్రామానికి చెందిన కుర్వ వెంకటేష్‌, మల్దకల్ మండలం పవనపల్లి (హెచ్), పాల్వాయికి చెందిన కె. రాఘవేంద్ర, గద్వాల మండలం బాస్లచెరువు గ్రామానికి చెందిన గొల్ల శశిధర్, అలంపూర్ మండలం క్యాతూర్ గ్రామానికి చెందిన వేముల రాజు, ఇటీక్యాల మండలం పెద్దదిన్నె గ్రామానికి చెందిన పెద్ద నర్సింహులు, మల్దకల్ మండలానికి చెందిన కుమారి వడ్డె ఆదిలక్ష్మి, గద్వాల మండలం గుంటిపల్లి గ్రామానికి చెందిన బి. రాజుకు రూ.6.00 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ నిబంధనల మేరకు సత్వర ఆర్థిక సహాయం అందించేందుకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని  కలెక్టర్ తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333