భద్రాచలం రామాలయం ఆస్థాన పురోహిత నియామకంలో వైదిక బ్రాహ్మణ సమాజం ఉసురుపోసుకున్న దేవాదాయ శాఖ

Jul 17, 2026 - 21:15
 0  0
భద్రాచలం రామాలయం ఆస్థాన పురోహిత నియామకంలో వైదిక బ్రాహ్మణ సమాజం ఉసురుపోసుకున్న దేవాదాయ శాఖ
భద్రాచలం రామాలయం ఆస్థాన పురోహిత నియామకంలో వైదిక బ్రాహ్మణ సమాజం ఉసురుపోసుకున్న దేవాదాయ శాఖ
భద్రాచలం రామాలయం ఆస్థాన పురోహిత నియామకంలో వైదిక బ్రాహ్మణ సమాజం ఉసురుపోసుకున్న దేవాదాయ శాఖ
భద్రాచలం రామాలయం ఆస్థాన పురోహిత నియామకంలో వైదిక బ్రాహ్మణ సమాజం ఉసురుపోసుకున్న దేవాదాయ శాఖ

శుక్రవారం రామభక్త ఆంజనేయ స్వామికి మాకు న్యాయం చేయమనిదరఖా స్తుసమర్పించి ఆ దరఖాస్తును ఈవో కార్యాలయంలో అందజేసిన పురోహితులు.

జూలై 17  టెంపుల్ టౌన్ భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఆస్థాన పురోహితునిగా వైదిక బ్రాహ్మణ సమాజానికి చెందిన వారు వందల సంవత్సరాలుగా ఆస్థాన పురోహితుని బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

రామాలయంలో ఆస్థాన పురోహితులు రిటైరై సుమారు నాలుగు4 సంవత్సరాలు అవుతోంది రిటైర్ అయినప్పటి నుండి ఆస్థాన పురోహితుని పోస్టు భక్త రామదాసు గారి కాలం నుండి ఆనవాయితీగా వైదిక బ్రాహ్మణుల నే నియమించడం జరుగుతూ వస్తోందని, కావున ఈసారి కూడా ఆస్థాన పురోహితునిగా వైదిక బ్రాహ్మణులనే ఎంపిక చేయాలని రామాలయం ఈవో నుండి దేవాదాయ కమీషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ శాఖ మంత్రి, మరియు ముఖ్యమంత్రి వరకు అనేక రూపాలలో విజ్ఞప్తులు చేయడం జరిగిందని, న్యాయం జరగకపోవడంతో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.
ఈవివాదం న్యాయస్థానంలో ఉన్న0 దున్న ఆస్థాన పురోహిత పోస్టు నియామకం నిలుపుదల చేయాలని పైన తెలిపిన వారికి లిఖితపూర్వక విజ్ఞప్తులు చేయడం జరిగింది.
ఇదిఇలా ఉండగా  గత నాలుగేళ్లుగా ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ జూలై 16వ తేదీ ఇచ్చిన నియామక ఉత్తర్వులలో ఆస్థాన పురోహితుని పోస్టు గత ఆనవాయితీ ప్రకారం వైదిక బ్రాహ్మణులకు కేటాయించకుండా దేవాదాయ శాఖ వారు వైదిక బ్రాహ్మణ సమాజం ఊసురుపోసుకున్నారని,దీంతో లక్షలాదిమంది వైదిక బ్రాహ్మణ సమాజం వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామావఝల రవికుమార్ భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ప్రధాన కార్య దర్శి పవన్ కుమార్ శర్మ తెలిపారు. 
రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనేస్పందించి ఆస్థాన పురోహిత నియామకం నిలుపుదల చేసి గత ఆనవాయతీ ప్రకారం వైదిక బ్రాహ్మణ సమాజానికి చెందిన సమర్ధుడైన పౌరోహితుని నియమించాలని భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం వారు డిమాండ్ చేశారు. 
ఈ కార్యక్రమంలో అశోక్ కుమార్ శర్మ, సత్యప్రసాద్ శర్మ, సుందర రామ శాస్త్రి, కదంబరి కృష్ణ శర్మ, బుక్కపట్నం. తేజాచార్య, రాజా శర్మ, శ్రీరామ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. 
ఎండ్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333