**పింఛన్ల పై ఏపీ ప్రభుత్వం ఫోకస్*

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి : పింఛన్ ల పై ఏపీ ప్రభుత్వం ఫోకస్!
పింఛన్ ల పై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ముందుగా దివ్యాంగ పింఛన్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు. సదరం శిబిరాల ద్వారా వైకల్యం శాతాన్ని పరిశీలిస్తున్నారు. దివ్యాంగ పింఛన్లను అనర్హులు కూడా పొందుతున్నారన్న నివేదికల ఆధారంగా ప్రభుత్వం దివ్యాంగ పింఛన్లను పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే పలుచోట్ల వైద్య బృందాలతో సదరం శిబిరాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు అర్హులందరికీ పింఛన్ లను అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.