పశువుల అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
- సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్.
రైతులు వ్యవసాయ అవసరాలకోసం సంతల నుండి కొనుగోలు చేసే పశువుల రవాణాకు అన్ని అనుమతులు ఉండాలి అని సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ అన్నారు. పశువుల రవాణా చేస్తున్న వాహనాలను సూర్యాపేట రూరల్ పోలీసులు పట్టుబడి చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ నందు సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రైతులకు పశువుల రవాణా చేస్తున్న వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. పశువులను రవాణా చేయడానికి అన్ని అనుమతులు కలిగి ఉండాలని సూచించారు. రైతులు సంతలో పశువులను కొంటే సంబంధిత సంత అధికారుల నుండి రసీదులు తీసుకోవాలని, పశువుల డాక్టర్ చేత రవాణా సర్టిఫికెట్ పొందాలని తెలిపారు. అనుమతులు లేకుండా పశువులను రవాణా చేస్తే చట్ట ప్రకారం కేసు నమోదు చేయడం జరుగుతుందని సూచించారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు సర్కిల్ పరిధిలో పశువుల అక్రమ రవాణాపై పటిష్టనిగా ఉంచామన్నారు. ఎవరైనా పశువులను అక్రమంగా రవాణా చేస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని సూచించారు. వ్యవసాయ అవసరాల నిమిత్తం సంతల నుండి పశువులను కొనుగోలు చేసే రైతులు సంత నిర్వహణ అధికారుల నుండి అన్ని రకాల అనుమతి పత్రాలు పొందాలని కోరారు.