కాంగ్రెస్ అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరికలు
సూర్యాపేట: కాంగ్రెస్ అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇండిపెండెంట్ సర్పంచ్ ధరావత్ కృష్ణ, ఇండిపెండెంట్ ఉపసర్పంచ్ బానోత్ రాజు లు కాంగ్రెస్ పార్టీలో చేరారని ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రం వైట్ హౌస్ లో జిల్లా కాంగ్రెస్ నాయకులు గాయం ఉదయశ్రీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలను రాజకీయంగా గుర్తించి వారికి అవకాశాలు కల్పించిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. నేడు అనేక మంది మంచి ఉద్యోగాల్లో స్థిరపడటాని కి కాంగ్రెస్ పార్టీ కృషే కారణమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు.ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వ ఘనతేనని అన్నారు. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన వారికి ప్రత్యేక గుర్తింపు, ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో విరన్న నాయక్, మహేష్, మహేందర్ రాజు, సాయి, అఖిల్, మన్సూర్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.