పర్యావరణం కాపాడుటలో మేము ముందు ఉంటామన్న పుడమి నాయకులు.
పర్యావరణం కాపాడుటలో మేము ముందు ఉంటామన్న పుడమి నాయకులు
తెలంగాణవార్త 30.09.2024.సూర్యాపేట జిల్లా ప్రతినిధి:-కౌన్సిల్ ఫర్ గ్రీన్ రేవల్యూషన్ మరియు తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో స్కూల్ ఎర్త్ క్లబ్ - యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాం లో భాగంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ బృందం ఆధ్వర్యంలో 6వ తరగతి నుండి 9వ తరగతి పిల్లలను ఇద్దరి చొప్పున స్కూల్ ఎర్త్ క్లబ్ గా ఎన్నుకొని కమిటీలు వేయడం జరిగింది.ఈ కమిటీలు పర్యావరణ పరిరక్షణ లో భాగం గా పిల్లలు అందురు భాగస్వామ్యలు అయి భావి తరాలకు ప్రకృతిని కాపాడి అప్పగిస్తామని, పర్యావరణం కాపాడుటలో మేము ముందు ఉంటామన్న నూతనంగా ఎన్నికైన పుడమి సంఘం నాయకులు అన్నారు.పర్యావరణం ను కాపాడకపోతే మానవుని మనుగడ లేదని అన్నారు.సీజీఆర్ బృందం మొక్కల రక్షణ, మొక్కలు పెంచే విధానం, ఔషద మొక్కల ఉపయోగం పై అవగాహణ కల్పించారు. ప్రతి పిల్లవానికి ప్లాస్టిక్ నివారణ, మొక్కల రక్షణ, నీటి నిల్వచేయడం వంటి పలు అంశాలను పిల్లలకు అవగాహన కల్పించి పుడమి నాయకులను తయారు చేశారు. ఈ కార్యక్రమం లో వివిధ పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు, మెంటార్ ఉపాధ్యాయులు , ఉపాధ్యాయుల బృందం, సిజిఆర్ జిల్లా ఇంచార్జి మామిడి శంకరయ్య, లీడ్ ఎర్త్ లీడర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.