పప్పు శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు

Apr 9, 2026 - 15:37
Apr 9, 2026 - 18:08
 0  0
పప్పు శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు
పప్పు శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు

జోగులాంబ గద్వాల 9 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:-  అలంపూర్. నియోజకవర్గo  ఎర్రవల్లి మండల పరిధిలోని వల్లూరు గ్రామంలో ఏర్పాటుచేసిన పప్పు శనగ కొనుగోలు కేంద్రాన్ని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. ప్రారంభించారు.

ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ రైతులు తాము పండించిన పంటను దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కేంద్రాలను ఏర్పాటు చేసిందని, రైతులు తమ పంటను ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు విక్రయించుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని,రైతు బాగుంటేనే ఊరు, రాష్ట్రం బాగుంటుందని,నియోజకవర్గంలోని పప్పు శనగ రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333