పది ఫలితాల్లో సిటీ టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

Apr 30, 2025 - 20:33
 0  10
పది ఫలితాల్లో సిటీ టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

600కు 595 మార్కులు సాధించిన ఎస్.సాయిసృజన

సూర్యాపేట : బుధవారం వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమైన మార్కులను సాధించినట్లు జిల్లా కేంద్రంలోని సిటీ టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ ఆర్.ప్రకాష్ రెడ్డి, ప్రిన్సిపాల్ టి.మురళీధర్ తెలిపారు.పదవ తరగతి పరీక్ష ఫలితాలు వెలువడిన సందర్భంగా ఆ పాఠశాల విద్యార్థులు సాధించిన మార్కుల వివరాలను వారు వెల్లడించారు. ఎస్.సాయి సృజన 600 మార్కులకు గాను 595 మార్కులను సాధించి జిల్లాస్థాయిలో మొదటి స్థానం, రాష్ట్రస్థాయిలో రెండవ స్థానం సాధించినట్లు తెలిపారు. బి.ప్రణవి 588 మార్కులు, జి.శ్రీజ 583, పి.హర్షిత 581, వై.ప్రజ్ఞా రెడ్డి 579, ఎస్.సాయిగోకుల్ 577, వై.శిశిర 577, ఎస్ సుదీపారెడ్డి 577, బి.కశ్యప్ రామ్ 575, ఎం సాయి రిష్విక్ 573, జి నితీశా వర్దిని 571 మార్కులను సాధించినట్లు తెలిపారు. అత్యుత్తమ మార్కులను సాధించిన విద్యార్థులను,ఈ ఫలితాల సాధనకు కృషిచేసిన ఉపాధ్యాయులను అభినందించారు.తమకు సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333