పదవ తరగతి పరీక్షల్లో 566 మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఎస్. అక్షయను జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అభినందించారు.

జోగులాంబ గద్వాల 2 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల:. శుక్రవారం ఐడీఓసీ తమ ఛాంబర్ నందు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల లో చదువుతున్న ఎస్.అక్షయ పదవ తరగతి బోర్డు పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన సందర్భంగా,ఆమెను అభినందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలల నుండి చదువుతున్న విద్యార్థులు అత్యుత్తమ స్థాయిలో రాణించగలరని అన్నారు. విద్య ద్వారా బాలికల సాధికారత పెరుగుతుందని,విద్యార్థులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని తెలిపారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జహురుద్దీన్, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.