పడకేసిన పరిశుభ్రత కుక్కడం గ్రామపంచాయతీ సిపిఎం మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్
సిపిఎం మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్

మాడుగులపల్లి, 11 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- : మాడుగులపల్లి మండలంలోని కుక్కడం గ్రామంలో డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని సిపిఎం మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.మంగళవారం నాడు సిపిఎం ప్రజా పోరుబాట కార్యక్రమంలో భాగంగా మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామంలో సమస్యల అధ్యయనం చేపట్టారుఈ సందర్భంగా మాట్లాడుతూ కుక్కడం గ్రామంలో ప్రధాన వీధులలో డ్రైనేజీ సమస్య సరిగా లేకపోవడం వలన డ్రైనేజీ నీరు రోడ్డుపై పారుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందన్నారుప్రభుత్వ అధికారులు వచ్చి చూసి ఫోటోలు తీసుకోవడం వరకే పరిమితం అవుతున్నారు తప్ప సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయడం లేదన్నారుదీనివలన డ్రైనేజీ సరిగ్గా లేకపోవడంతోటి మురుగునీరు రోడ్డుపై పారడంతో ఇళ్ళ ముందుకు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారువీటివలన విషజ్వరాలు ప్రబలి ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే పరిస్థితి ఉందన్నారుడెంగ్యూ,మలేరియా వంటి రోగాల బారిన పడి ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారుప్రభుత్వ అధికారులు వస్తున్నారు,పోతున్నారు తప్ప మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేరు మా సమస్య ఎవరు పరిష్కరించడం లేదు చాలా రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్న కూడా ఎవరు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారుఇప్పటికైనా అధికారులు స్పందించి మా సమస్యను పరిష్కరించాలని కోరారుఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు పోలెబోయిన వరలక్ష్మీ,మండల కమిటీ సభ్యులు పతాని శ్రీను,అయితగాని విష్ణు,మునాగల నారాయణ రెడ్డి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.