పచ్చటి మొక్కలతోనే   బావి తరాలకు భవిష్యత్తు

Jul 26, 2024 - 18:24
 0  8

వన మహోత్సవ కార్యక్రమంలో  జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస రావు, IPS.

జోగులాంబ గద్వాల 26 జూలై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. వాతా వరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని, తద్వారనే బావితారలకు మంచి భవిష్యత్ అందించగలమని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు,IPS   పిలుపునిచ్చారు.శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జిల్లా ఎస్పి  పోలీస్ అధికారులతో కలిసి ఘనంగా వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించి  మొక్కలు నాటారు.

  ఈ సందర్బంగా ఎస్పీ   మాట్లాడుతూ....వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరు బాధ్యతగా బావించి మొక్కలు నాటాలని, పచ్చటి మొక్కలు నాటడమంటే భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తు  ఇవ్వడమే అని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే బాధ్యతను స్వీకరించాలని, నాటడంతోపాటు, వాటి సరంక్షణ బాధ్యతను తీసుకోవాలని సూచించారు.  అన్నారు .వనమహోత్సవం కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు ముందుండడం జరుగుతుందని, ప్రతి పోలీస్  స్టేషన్ పరిధిలో నిర్ధేశిత మొక్కలు నాటాడo జరుగుతుందని అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో  జిల్లా పోలీస్ కార్యాలయాల ఆవరణ లో ఈ రోజు మొత్తం 605 మొక్కలు నాటినట్లు జిల్లా ఎస్పీ  తెలిపారు. 

 ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ కె.గుణ శేఖర్ , డీ.ఎస్పీ సత్యనారాయణ , కార్యాలయ ఏ.ఓ సతీష్ కుమార్,  రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటేష్, హారీఫ్, సూపరింటెండ్ నాయీం, టౌన్ ఎస్సై శ్రీనివాస్, రూరల్ ఎస్సై పర్వతాలు, ఎస్సై లు రజిత , జి.రజిత,  ఆర్. ఎస్సై లు విజయ్ భాస్కర్, చంద్ర కాంత్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333