నేషనల్ టాలెంట్ టెస్ట్ లో జాతీయ మూడవ ర్యాంక్ సాదించిన బాలెంల తాత్విక

Apr 21, 2026 - 19:48
 0  5
నేషనల్ టాలెంట్ టెస్ట్ లో జాతీయ మూడవ ర్యాంక్ సాదించిన బాలెంల తాత్విక
నేషనల్ టాలెంట్ టెస్ట్ లో జాతీయ మూడవ ర్యాంక్ సాదించిన బాలెంల తాత్విక

అడ్డగూడూరు 21ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంనికి చెందిన బాలెంల దుర్గయ్య విద్యుత్ లైన్ మెన్ చిన్న కూతురు తాత్విక హైదరాబాద్ లోని నారాయణ కొంగరి కలన్ బ్రాంచిలో తొమ్మిదో తరగతి చదువుతుంది అక్కడ సి నాప్స్ సంస్థ వాళ్ళు నిర్వహించిన నేషనల్ టాలెంట్ టెస్ట్ లో భారత దేశం స్థాయిలో మూడవ ర్యాంక్ సాధించిన సందర్భంగా మంగళవారం రోజు హైదరాబాద్ లోని రవీంద్ర బారతిలో ఆ సంస్థ ఏజిఎం గోపాల్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంశ పత్రం షీల్డ్ స్మార్ట్ వాచ్ ని అందిచడం జరిగింది.ఈ సందర్బంగా బాలెంల దుర్గయ్య మాట్లాడుతూ.. నా కూతురు జాతీయ స్థాయిలో ర్యాంక్ రావడం చాలా సంతోషం గా ఉంది గత సంవత్సరం ఎనిమిదో తరగతిలో జాతీయ స్థాయిలో ఐదవ ర్యాంకు ఆరవ తరగతిలో రాష్ట్ర స్థాయిలో ప్రధమ ర్యాంక్ సాధిండం జరిగింది.అని అన్నారు అలాగే మన పిల్లలు ఎక్కడ చదివిన వాళ్ళు బాధ్యతగా చదివినప్పుడే ఇలాంటి ఫలితం వస్తుంది అని అన్నారు మా పాప కు మంచి విద్యను అందించిన నారాయణ స్కూల్ కొంగరి కాలన్ బ్రాంచ్  యాజమాన్యం ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులకు,అందరికి పేరు పేరు నా ధన్యవాదములు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333