జగద్గురు ఆదిశంకరాచార్య స్వామివారి జయంతి వేడుక

Apr 21, 2026 - 19:52
 0  1
జగద్గురు ఆదిశంకరాచార్య స్వామివారి జయంతి వేడుక
జగద్గురు ఆదిశంకరాచార్య స్వామివారి జయంతి వేడుక
జగద్గురు ఆదిశంకరాచార్య స్వామివారి జయంతి వేడుక

తెలంగాణ వార్త ఏప్రిల్ 21 జిల్లా స్టాపర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : వైశాఖ శుద్ధ పంచమి జయ వారంజగద్గురు ఆదిశంకరాచార్య జయంతి సందర్భంగా భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం వారు భక్తిశ్రద్ధలతో శంకర జయంతి నిర్వహించారు. భారత సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడే విధంగా భారతీయులకు సన్మార్గాన్ని చూపించి హైందవ సాంప్రదాయాలను పూజలందుకునే విధంగా రూపొందించిన జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి వారికి భక్తి పూర్వక నమోవాకములు సమర్పిస్తున్నట్లు గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామా వఝల. రవికుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అశోక్ కుమార్ శర్మ, రాయప్రోలు. సత్య ప్రసాద్ శర్మ, వేణుగోపాలచార్యులు, కంజర్ల, విజయ్ కుమార్, ఆర్ వి శ్రీనివాస్ శర్మ, నరసింహ శర్మ తదితరులు పాల్గొన్నారు.  అనంతరం, వడపప్పు, పానకం పంపిణీ చేశారు 


జగద్గురు శంకరాచార్య స్వామి వారి శుభాశీస్సులతో భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని పౌరోహితులు ఆశీస్సులు తెలిపారు. సర్వేజనా సుఖినోభవంతు. 

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333