నేడే ఉద్యోగ రిటైర్మెంట్

Mar 31, 2026 - 10:29
 0  4
నేడే ఉద్యోగ రిటైర్మెంట్

నేడే ఉద్యోగ రిటైర్మెంట్ మోతే 31 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని విభళాపురం గ్రామం నందు పుణ్య దంపతులు  కుంభజడ రాములు&నాగమ్మ మొదటి సంతానం కుంభజడ వెంకటేశ్వర్లు పెద్దన్నయ్యగా పెద్దన్న పాత్ర పోషించి తన జీవితకాలం అంతటినీ  కుటుంబానికి అంకిత మిచ్చిన పేరు గల పెద్దన్న మా అన్నయ్య బాల్యం నుండి ఎన్నో బాధలు బాధ్యతలు మోస్తూ చదువులో టెన్త్,ఇంటర్,డిగ్రీ వరకు చదివి తనకు నచ్చిన తను మెచ్చిన ఒకే ఒక ఉద్యోగం ఆర్టీసీ డ్రైవర్ గా బతకడం మాత్రమే.ఎన్నో బ్యాంకు ఉద్యోగాలు,పోలీసు ఉద్యోగాలు రకరకాలగ ఎంప్లాయ్మెంట్ ద్వారా వస్తున్నప్పటికీ నేను మాత్రం ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగానికి మాత్రమే వెళ్తానని చెప్పి దానికోసం మాత్రమే కలలు కని ఆ ఉద్యోగoల్లోనే స్థిరపడి నేడు ఉద్యోగ విరమణ చేస్తున్న శుభసందర్బంలో..మా అందరి అభిమాన ఆరాధ్యo మా అన్నయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ..అమ్మానాన్నలకు అక్షరం లేన్నప్పటికీ మా పిల్లలను బాగా చదివించాలని 50 సంవత్సరాల క్రితమే ప్రతిమ పూని అందరికీ అక్షర జ్ఞానం అందించిన కృషి ఫలితమే నేడు మేము అందరము ఉద్యోగంలో స్థిరపడినాము ఆ అక్షరమే మాకు అన్నం పెట్టిందని సగర్వంగా తెలియజేస్తూ..అమ్మానాన్నలను మించిన దైవమున్నదా ఆత్మను మించిన అర్థం ఉన్నదా అనే పెద్ద కొడుకుగా చిన్నమ్మ బాబాయిల త్యాగాలకు గుర్తుగా బాధ్యతలు పంచే పెద్దన్నయ్యగా అత్తమ్మ మామయ్య ఆదరణకు అణువుగా బావయ్యగా చెల్లె బావల సంతోషాలకు ఆనందాలకు చెదరని చిరునవ్వుగా అన్నదమ్ముల అనుబంధానికి ఆత్మీయతను పంచే అన్నగా చిన్న పెద్దలను గౌరవించే గౌరవ పెద్దన్నగ కష్ట సుఖములలో కాయకష్టములలో కలుపుకొని పోతూ ఉండే కాపలాదారుడు ఆపద అంటే ఆదుకునే ఆపద్బాంధవుడిగా చిన్న పెద్ద & ఊరు వాడ & చిన్న చిత్తక అందరివాడు ఈ వెంకటేశ్వరుడు.గత 30 సంవత్సరాలుగా ఆర్టీసీ డ్రైవర్గా సేవలందించిన మా అన్నయ్య మంగళవారం రోజు పదవి విరమణ చేస్తున్న శుభ సందర్భంలో వారికివే మా హార్దిక శుభాకాంక్షలు అని తమ్ముడు వీరబాబు,ఝాన్సీ కుటుంబ సభ్యులు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333