నేడు లోక్ సభలో మూడు ప్రధాన బిల్లులపై చర్చ
హైదరాబాద్:ఏప్రిల్ 16 : దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పే అవకాశం ఉన్న మూడు ప్రధాన బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోకసభలో ప్రవేశ పెడు తుంది, మహిళ రిజర్వేషన్ అమలు, నియోజకవర్గంల పునర్విభజన, కొత్త డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు వంటి అంశాలను కలిగి ఉన్న ఈ బిల్లులపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది,
నేటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నా యి.ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవర ణ, డీలిమిటేషన్ వంటి కీలక బిల్లులపై చర్చ జరగనుంది. 2023లో ఆమోదించబడిన మహిళా రిజర్వేషన్ చట్టమైన నారీ శక్తి వందన్ చట్టాన్ని పూర్తి గా అమలు చేయడమే ఈ బిల్లుల లక్ష్యం. 2029 నాటికి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడం, లోక్‌సభలో సభ్యుల సం ఖ్యను 850కు పెంచడమే మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.
మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెడుతుండగా.. మూడో బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. లోక్ సభలో 18 గంటల పాటు చర్చ చేపట్టనున్నారు. అనంతరం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ 10 గంటల పాటు చర్చ చేపట్టనున్నారు.
ఇదిలా ఉంటే డీలిమిటేషన్ బిల్లును ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకి స్తోంది. అంతేకాకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా కేంద్రం దురుద్దేశం తోనే తీసుకొస్తోందని ఆరోపించింది. అయితే బిల్లులపై ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి మధ్య యుద్ధం జరిగే సూచనలు కనిపిస్తు న్నాయి. మూడు రోజుల ప్రత్యేక సమావేశాల్లో బిల్లులు ఆమోదం పొందుతాయా? లేదా?అన్నది వేచి చూడాలి.!