పర్యవేక్షణ లేని 100 ప్యాకేజ్, కెనాలు పనులు
వార్డ్, మెంబర్, ఆంజనేయులు మరియు గ్రామ ప్రజలు.
జోగులాంబ గద్వాల 26 మే 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలం చాగాపురం శివారులో గల100 ప్యాకేజ్ కెనాల్ లో డి సిక్స్ ఎల్ ఓ టి దగ్గరబెడ్, కాంక్రీట్, పనులు, జరుగుతున్నసందర్భంగా అక్కడ సంబంధిత సూపర్వైజర్స్, కానీ ఏఈలు కానీ సంబంధిత అధికారులు లేనిలోటు స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు అక్కడలేరు. కానీ అక్కడ ఏమైనామెజర్మెంట్, తక్కువ కానీ ఎక్కువ కానీ అయితే ఎవరి బాధ్యత అని, గ్రామ ప్రజలు కాంట్రాక్టర్ ను నిలదీయడం జరిగింది. చాగాపురం గ్రామ సమీపాన బ్లాస్టింగ్ పనులు జరుగుతున్న కూడా సంబంధిత అధికారులు ఎవరూ లేరని గ్రామ ప్రజలు నిలదీశారు. ప్రమాదకర పనులు జరుగుతున్న కూడా అధికారులు ఎవరు లేకుండా ఉన్నతీరును ఉన్నతాధి కారుల దృష్టికి, తీసుకుపోతామని గ్రామ ప్రజలు అన్నారు.
వివరణ - పై విషయంపై తెలంగాణ వార్త నుంచి చరవాణి ద్వారా సంప్రదించగా స్పందించడం లేదు. ఇందులో వార్డ్ మెంబర్ ఆంజనేయులు,గ్రామప్రజలుతదితరులుఉన్నారు.