సూర్యాపేటలో సభ్యత్వ సునామీ – జర్నలిస్టులకు భరోసా ఇస్తున్న టియుడబ్ల్యూజే ఐజేయు
అక్రిడిటేషన్ నుంచి ఇంటి స్థలం దాకా – టియుడబ్ల్యూజే ఐజేయు తీసుకుంటుంది బాధ్యత
సూర్యాపేట, 01 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్ :- జర్నలిస్టుల సమస్యలపై ఎల్లప్పుడూ రాజీలేని పోరు సల్పుతూ, అర్థ శతాబ్ద కాలంగా సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్నామని టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు చలసాని శ్రీనివాసరావు అన్నారు. టియుడబ్ల్యూజే ఐజేయు సభ్యత్వ క్యాంపెయిన్‌లో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీనియర్ జర్నలిస్టులు ఎస్కే ఆసిఫ్, ఎస్కే అహ్మద్ లకు యూనియన్ సభ్యత్వం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలకులు ఎవరైనా జర్నలిస్టుల పక్షాన నిలబడే సంఘం టియుడబ్ల్యూజే ఐజేయు మాత్రమేనని స్పష్టం చేశారు. జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు అందజేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో త్వరలో జిల్లాలో జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం పెంపుదలకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ బంటు, సీనియర్ జర్నలిస్టులు షేక్ రషీద్, గుడిపూడి రామకృష్ణ, తండు వెంకన్న, కందుకూరి యాదగిరి, సురేందర్, షేక్ జహీర్, కొండ్లె కృష్ణయ్య, రామచంద్ర రాజు, దుస్సా చంద్రశేఖర్, దుర్గం బాలు, పోలోజు సందీప్, వెంకట్, మధు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.