నేటి నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ
తెలంగాణ : ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం మరోసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో శనివారం నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో సుమారు 3.41 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా చౌకధరల దుకాణాలు ఆగస్టు నెల మొత్తం పనిచేయనున్నాయి. ఈ-కేవైసీ గడువును ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.