నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డిని సన్మానించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
గత నవంబర్ నెలలో జరిగిన లోకమంతన్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు స్కూల్ కాలేజీ మేనేజ్మెంట్ ల హాజరు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే సామెత అచ్చంగా మన షాద్ నగర్ పట్టణ భారతీయ జనతా పార్టీ సీనియర్ రాష్ట్ర కార్యవర్గ నాయకుడు నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డికి సరిపోతుంది. విషయం ఏమిటంటే గత నవంబర్లో లోక్ మంతన్ కార్యక్రమం హైదరాబాద్ శిల్పారామాములో నిర్వహించారు. లోకమంతన్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సనాతన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కళలను పరిరక్షించి ముందు తరాలకు అందజేయడమే. అలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించి అందరి మన్ననలు పొంది ఈరోజు అందరి చేత సత్కరించే దిశగా ముందడుగు వేశాడు. ఈ కార్యక్రమంలో తెలంగాణలోని అన్ని స్కూల్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు, సుమారు నాలుగు లక్షల మంది విద్యార్థులు ఆ కార్యక్రమములో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపతీ మురుము, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరు కాగా వారితోపాటు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు డిప్యూటీ ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు పాల్గొన్నారు .ఈ రోజు లోకమంతన్ సక్సెస్ మీట్ కార్యక్రమము నిర్వహించారు .ఈ కార్యక్రమము విజయోత్స్వాములో భాగస్వామ్యం ఐన ఆయా కాలేజీ,స్కూల్ యాజమాన్యాలను కిషన్ రెడ్డి ఘనముగా సన్మానించారు.లోకమంతన్ కార్యక్రమాన్ని విజయోత్స్వాములో యాజమాన్యాలను భాగస్వామ్యము చేయడములో కీలకంగా వ్యవహరించిన భాజపా రాష్ట్ర కార్యవర్గ నాయకుడు వివేకానంద విద్యాసంస్థల కార్యదర్శి నెల్లి శ్రీవర్ధన్ రెడ్డిని కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరంలోని స్థాన్లీ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా సత్కరించారు.. KP