నెంబర్‌ ప్లేట్‌లేని వాహనాలపై కేసులు:ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు 

Sep 4, 2024 - 20:00
 0  11
నెంబర్‌ ప్లేట్‌లేని వాహనాలపై కేసులు:ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు 

జోగులాంబ గద్వాల 4 సెప్టెంబర్ 2024 తెలంగాణ:- వాహనాల నెంబర్‌ ప్లేట్లు సరిగా లేని వాహనదారులపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు హెచ్చరించారు.బుధవారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గద్వాల్ సీఐ కార్యాలయ పరిధిలో వాహనాల తనిఖీ చేపట్టారు.సరైన పత్రా లు లేని,డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి అపరాధ రుసుము విధించారు.మైనర్లు వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి జరిమానాలతో పాటు సరైన నంబర్‌ ప్లేట్లు, పత్రాలు లేని పలు ద్విచక్రవాహనాలకు జరిమానా తో పాటు సిజ్ చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ...కొందరు వాహనదారులు వాహనాల నెంబ ర్లు ట్యాంపరింగ్‌ చేస్తున్నారన్నారు. అటువంటి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు.నెంబర్‌ ప్లేట్లు ట్రాఫిక్‌ నిబంధనల ప్రకారం ఉండేలా చూచుకోవాల్సిన బాధ్యత వాహనదారులపైన ఉందన్నారు.  తప్పనిసరిగా వాహన ధ్రువీకరణ పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్‌ పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసే వారిపై, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వారికి లేని వారికి బండి ఇవ్వడం, మైనర్‌ పిల్లలకు వాహనాలు ఇవ్వడం, నెంబర్‌ ప్లేట్‌ లేకుండా వాహనాలు నడపడం,మద్యం సేవించి వాహనాలు నడపడంలాంటి వాహనాలపై కేసులు నమోదు చేస్తామన్నారు. వర్షాకాలం కాబట్టి వాహన దారులు హెలిమెంట్ ధరించి,అప్రమత్తంగా నడపాలని సూచించారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని తెలిపారు. వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని వాహనదారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది రమేష్,సుధాకర్, విష్ణు,తిమ్మప్ప, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333