నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి

Jan 21, 2025 - 18:11
Jan 21, 2025 - 18:29
 0  17
నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి

భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలం గొమ్ముగూడెం గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు గ్రామస్తుల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ శోభన్ బాబు మాట్లాడుతూ కొత్తగా రేషన్ కార్డులు కొరకు 31 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఆత్మీయ భరోసా కి 27 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇంద్రమ్మ ఇళ్లకి 104 మంది లిస్టు వచ్చిందని ఇంకా రావాల్సిన 114 మంది దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని బిల్డింగులు, భూములు ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరగదని నిరుపేదలకి ఇల్లు మంజూరు అయ్యేలా పై అధికారులతో మాట్లాడి ఇందిరమ్మ ఇల్లులు మంజూరు చేస్తామని సెక్రటరీ శోభన్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్ల మండల స్పెషల్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఏడి. బి. సుధాకర్ రావు, ఏవో. లావణ్య, ఐసి.డి.ఎస్ ప్రాజెక్ట్ అధికారి చైతన్య ఆర్. ఐ. వరలక్ష్మి టి. ఏ. బాలకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.