నిత్య కృషివలుడు మీలా

చకిలం రాజేశ్వరరావు పిసిసి అధికార ప్రతినిధి

Feb 1, 2025 - 08:18
Feb 1, 2025 - 08:29
 0  15
నిత్య కృషివలుడు మీలా

అవిశ్రాంత పారిశ్రామికుడు మీలా

కక్కిరేణి శ్రీనివాస్ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్

జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ *కక్కిరేణి శ్రీనివాస్* గారి ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ *మీలా సత్యనారాయణ* గారి జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిసిసి అధికార ప్రతినిధి *చకిలం రాజేశ్వరరావు* మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, శ్రమయేవ జయతే అనే సిద్దాంతాన్ని నమ్మి సుధాకర్ పివిసి పైపుల కంపెనీని స్థాపించి అనతికాలంలోనే పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగి, రెండు సార్లు సూర్యాపేట పట్టణ పురపాలక సంఘం చైర్మన్ గా పనిచేసి, పట్టణ అభివృద్ధి కి కృషి చేసి, చివరిదాకా కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి పరితపించి, ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి అవార్డును పొందిన మీలా గారి జయంతి సందర్భంగా వారిని ఘనంగా స్మరించుకుంటూ, మా నివాళులు అర్పించినట్లు తెలిపారు.

జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ ఎలిమినేటి అభినయ్,మాజీ కౌన్సిలర్ రాపర్తి శ్రీను, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులు రుద్రంగి రవి, నాగుల వాసు, సేవదాల్ చీఫ్ ఆలేటి మాణిక్యం, జిల్లా కాంగ్రెస్ నాయకులు గార్లపాటి వెంకట్ రెడ్డి, పందిరి మల్లేష్ గౌడ్, సాజిత్, దంతాల సాయి నవీన్,ఇజ్రార్ అహ్మద్, మధుకర్ రెడ్డి,కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333