నాగర్ కర్నూల్ కుమ్మేర గ్రామంలోని జాతరలో జరిగిన ఘటన అత్యంత దుర్మార్గం

Feb 23, 2026 - 19:27
 0  1

దాడికి పాల్పడిన ఎనిమిది మంది పైన తక్షణమే మర్డర్ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించాలి.

ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యనే

బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య


 జోగులాంబ గద్వాల 23 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల జిల్లా రజక సంఘం, మాజీ కౌన్సిలర్ రజక జయశ్రీ నరసింహులు  ఆధ్వర్యంలో కలెక్టర్ రేట్ వరకు భారీగా చేపట్టిన నిరసన ర్యాలీకి మద్దతుగా జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షనా మద్దతు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య
 
చాకలి కులానికి చెందిన వారిని గుడిలోకి వెళ్ళానియ్యకుండా దాడి చేసి పసిబిడ్డను కాలితో తన్ని  చంపిన నిందితులపై ఎందుకు మర్డర్ కేసు నమోదు చేయలేదు అని డిమాండ్ చేసారు.

ఈ ఘటన చాలా దురదృష్టకరం సమాజం తలదించుకునే ఘటన

మరణించిన పచ్చిపాపకు నివాళులు అర్పిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.

ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ...

* నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో అకారణంగా చాకలి చంద్రకళ మహిళా కుటుంబం పైన దాడి చేసి పాప కారణానికి కారకులైన 8 మంది కాంగ్రెస్ గుండాల పైన మర్డర్ కేసు నమోదు చేసి తక్షణమే రిమాండ్ చేయాలని అని అన్నారు.

* అధికార బలం కులాహంకారంతో కాంగ్రెస్ సర్పంచ్ తో పాటు అతని వర్గీయలు దాడి చేయడం చాలా అత్యంత బాధాకరం అని అన్నారు. 

* కాంగ్రెస్ పాలనఅంటే నే అరాచకం.
* బాధ్యుల పట్ల రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థనే ఇంతవరకు నిందితులను పై మర్డర్ కేసు నమోదు చేయకపోవడం అంటే కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలకడమే అని అన్నారు.

* పోలీస్ వ్యవస్థ పైన ప్రజలకు సామాన్యులకు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యుల పట్ల న్యాయం చేయాలని అన్నారు.
* తక్షణమే మరణించిన పసిపాపకు కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మరియు ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333