నందిగామ 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఘనంగా""బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆధ్వర్యంలో

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి నందిగామ : మండల న్యాయ సేవాధికారి కమిటీ ఆధ్వర్యంలో నందిగామ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వరద బోయిన విజయ్ కుమార్ అధ్యక్షతన నందిగామ కమ్మ కళ్యాణ మండపం లో 11వ అంతర్జాతీయ యోగ
దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి న్నారు. సీనియర్ న్యాయవాది, యోగా గురూజీ శ్రీ నెలకుదుటి లక్ష్మీనారాయణగారిచే న్యాయవాదు లు,కోర్టు సిబ్బందిచే యోగ చేయించి నారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు మాజీ ఏపీపీలు,ఏ జి పి. యర్రమరెడ్డి బాబురావు,ఈశ్వర ప్రగడ రంగా రావు, మట్ట ప్రసాద్ మాట్లాడుతూ
మనిషి యొక్క జీవన విధానంలో శాంతి, సహనం, ఓర్పు, మనసుకు ప్రశాంతత, ఆరోగ్యవంతమైన జీవితం గడపాలంటే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేయాలని
తత్ ద్వారా ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని కొనసాగించ వచ్చని, ఇప్పటి ఆధునిక కంప్యూటర్ పోటీ ప్రపంచంలో జీవన విధానంలో మనిషి యొక్క జీవితకాలం తగ్గి పోతుందని, యోగా చేయటం వలన ఆహ్లాదకరమైన జీవితాన్ని గడపవచ్చునని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో బార్ ప్రధాన కార్యదర్శి అద్దంకి మణిబాబు, లైబ్రేరియన్ షేక్ ఆజాద్,యర్ర గొర్ల రామారావు,షేక్ సైదా, సుబ్రహ్మణ్యం ఘంట నాగేశ్వరరావు.పులవర్తి కోటేశ్వరరావు, పవన్ కుమార్, అప్పాజీ. పెనుగొండ రామచంద్రారెడ్డి, తరితర న్యాయవాదులు, జిల్లా కోర్టు ఏ,వో, విజయలక్ష్మి,సూపర్ఇండెంట్ జ్యోతి, ఎం.ఎల్.ఎస్.సి స్టాప్ జ్యోతి మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు
అనంతరం యోగా గురూజీ న్యాయవాది అయినా నెలకుదిటి లక్ష్మీనారాయణ ను ఘనంగా జన్మానించినారు.