ధర్మారం గ్రామంలో మత్స్యకారులపైనే పోలీస్ కేసులు

Jun 4, 2026 - 20:31
 0  166

అడ్డగూడూరు 4 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని ధర్మారం గ్రామ మత్స్యకార సహకార సంఘం చెరువుల్లో చేపల దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తులను పట్టుకున్నప్పటికీ,బాధితులైన మత్స్యకారులపైనే తిరిగి కేసులు నమోదు చేయడం దారుణమని తెలంగాణ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్.వి.రమణ ముదిరాజ్ తీవ్రంగా ఖండించారు.ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ..మత్స్యకారుల జీవనాధారమైన చెరువులను రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.దానికి విరుద్ధంగా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ..దొంగలకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.మత్స్యకారుల హక్కులను కాలరాస్తున్న ఇటువంటి చర్యలను ప్రభుత్వం,పోలీసు ఉన్నతాధికారులు వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. బాధిత మత్స్యకారులకు న్యాయం జరగకపోతే,రాబోయే రోజుల్లో ఈ అంశాన్ని రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా తీసుకెళ్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ధర్మారం మత్స్యకారుల ముదిరాజుల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనిల్,ధర్మారం మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు దాసరి ఈశ్వర్, దాసరి పులేందర్,కార్యదర్శి దాసరి బిక్షం,సభ్యులు రామచంద్రు,మహేష్,శ్రీను, మధు,నారాయణ,దశరథ సోమలక్ష్మి,మహేష్,లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333