దౌదర్పల్లి గ్రామంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం 

Aug 1, 2026 - 22:01
 0  0

 జోగులాంబ గద్వాల 1 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  ఈరోజు దౌదర్పల్లి గ్రామంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

••• ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 

DIO ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మొహమ్మద్., 
DVLM నరేంద్రబాబు. 
హెల్త్ సూపర్వైజర్ శ్యాంసుందర్ హాజరై మాట్లాడారు. 

•••  ప్రోగ్రాం ఆఫీసర్ * *మాట్లాడుతూ  

1.  పుట్టిన వెంటనే గంటలోపు తల్లిపాలు ఇవ్వాలి
2.  6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి
3.  తల్లి నుండి వచ్చే మొదటి పసుపు రంగు చిక్కని పాలు - "కొలొస్ట్రమ్" బిడ్డకు అమృతంతో సమానం
4.  తల్లి అనారోగ్యంగా ఉన్నా సరే బిడ్డకు పాలు ఇవ్వవచ్చు
5.  తల్లిపాలు ఇవ్వడం వలన తల్లికి గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది..........
6. 2 సంవత్సరాల వరకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం అందించడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, పోషకాహార లోపం తగ్గుతుంది అని తల్లులకు అవగాహన కల్పించారు.
 ఈ కార్యక్రమంలో
ANM రాధ గారు, 7వ వార్డ్ అంగన్వాడీ టీచర్ చిట్టెమ్మ , ASHA కార్యకర్తలు సారిక, శంకరమ్మ
•••• దౌదర్పల్లి గ్రామ తల్లులు అందరూ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333