అయిజ లో ఇంతకి 30 పడకల హాస్పిటల్ కి యోగం ఉందా లేదా

Aug 1, 2026 - 22:00
 0  1

నిత్యం పదుల సంఖ్య లో డయాలసిస్ పెసెంట్స్ అవస్థ పడుతూ గద్వాల కు వెళుతున్నారు

PHC లో సరిపడ డాక్టర్స్ లేక రోగులు కు తీవ్ర ఇబ్బదులు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సబ్యులు ఎస్.రామచంద్రారెడ్డి

 జోగులాంబ గద్వాల 1 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  అయిజ.*పట్టణ & మండల అధ్యక్షలు *తెలుగునర్సింహ గోపాల కృష్ణ ఆధ్వర్యం లో నిర్మాణం పెండింగ్ లో ఉన్న 30 పడకల హాస్పటల్ ముందు ధర్నా*కార్యక్రమం జరిగింది ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ…అయిజ కు సమీపంలో *1000 కోట్లతో (కర్నూల్ నుండి రాయచూరు అంచనా)  నిర్మాణం అవుతున్న భారత్ మాల రోడ్ ఈ హాస్పటల్ భూమిపూజ తర్వాత ప్రారభం ఐనది దాదాపు పూర్తి అవుతుంది*అదేవిధంగా *అలంపూర్  X రోడ్ దగ్గర లేటుగా భూమిపూజ ఐన 100 పడుకల హాస్పటల్ కూడా పూర్తిఐ వైద్య సేవలు ప్రారభం ఐనవి మరి యందుకు ఈ హాస్పటల్ పూర్తి కావడం లేదు అయిజ మండల పట్టణ జనాబా లక్షకు పైగ ఉంది రాష్ట్ర లో మిగితా ప్రాంతాలలో చిన్న చిన్న మండలాలలో 100 పడుకల హాస్పటల్స్ ఉన్నాయి కాని మన పాలకుల నిర్లక్షం తో ఈ చిన్న 30 పడుకల హాస్పటల్ కూడా పూర్తి కావడం లేదు ప్రజలు అన్ని గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు తగిన బుద్ది చెబుతారు అని వారు మండి పడ్డారు ఈ కార్యక్రమం లో BJYM,OBC,మహిళా మోర్చా ల జిల్లా అధ్యక్షులు బాబుల్ రెడ్డి,దేవదాసు,సమతా గద్వాల పట్టణ అధ్యక్షులురాలు రజకజయశ్రీ,సద్దాల కృష్ణ,పాండు తూముకుంట అంజి, దేవబండ రామకృష్ణ వర్మ,సాయి,సతీష్ ,శాంతి నగర్ అశోక్,పైపాడు వెంకటేష్ తదితరులు పాలుగొన్నారు….

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333