దొంగలొస్తున్నారు... జాగ్రత్త...!

ఇంటి తలుపు తడుతున్నారు...!
గడ్డపారలతో దుకాణాల షెట్టర్లు పగులగొట్టి చోరి చేస్తున్నారు.
సీసీ కెమెరాలు ఉన్న We Don't Care...????
జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్ల వద్ద పలు దుకాణాలలో వేకువజాముమ వరుస దొంగతనాలు. పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:గద్వాల పోలీసులు
గద్వాల: వేకువజామున దర్జాగ వస్తున్నారు... అందినకాడికి దోచుకుని వెళ్తున్నారు. వేకువజామున అందరు నిద్రలో ఉంటారని మమ్మల్ని ఆపేదెవరని ఇలా తెగిస్తున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో పలు దుకాణాలలో చోరీలు కలకలం రేపాయి. వివరాలకు వెళ్లితే....
జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ కు కూత వేటు దూరంలో సోమవారం నాలుగు గంటల ప్రాంతంలో ఓ కంప్యూటర్స్ దుకాణాని గుర్తుతెలియని దొంగలు గడ్డపారతో షేట్టర్ ను ధ్వంసం చేసి దుకాణం కౌంటర్లో ఉన్న దాదాపు ముప్పై వేల రూపాయలు ఎత్తుకెళ్లారు. అలాగే కృష్ణవేణి చౌరస్తా సమీపంలో గల ఓ మొబైల్ దుకాణం షెట్టర్ ను గడ్డపారతో ద్వంసం చేసి చొరబడి ఏమి దొరకకా పక్కన ఉన్న మరో దుకాణంలోకి చొరబడ్డారు. అక్కడ కూడా ఏమి దొరకకా వెనుదిరిగారు. ఇలా నాలుగు షాపులో ఒకే సారి చోరికి యత్నించారు. విషయం తెలుసుకున్న గద్వాల టౌన్ పోలీసులు చోరి జరిగిన దుకాణాలను పరిశీలించారు. కొత్తబస్టాండ్ ఎదురుగా ఉన్న కంప్యూటర్స్ షాప్ ను సందర్శించి సిసి కెమెరాలో రికార్డు అయిన వివరాలను సేకరించారు. దుకాణం షేట్టర్ ను ధ్వంసం చేసే సన్నివేశం స్పష్టంగా రికార్డయ్యాయి. వేకువ జామున ఈ సంఘటనలు చోటు చేసుకోవడంతో పట్టణ ప్రజలు ఇతర వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.