దేశంలోనే తొలి యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

Jul 9, 2026 - 19:43
 0  1

 ఐడీఓసీ సమావేశ మందిరం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వీక్షించిన జిల్లా కలెక్టర్ అంకిత్


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి *యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (YIPESU)*ని గురువారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్, ఐఏఎస్ వర్చువల్ విధానంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, యువతలో క్రీడాస్ఫూర్తి, శారీరక దృఢత్వం, ఆరోగ్యకర జీవనశైలిని పెంపొందించడంతో పాటు ప్రపంచ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. క్రీడా విద్య, పరిశోధన, సాంకేతికత, ఆవిష్కరణలకు ఈ విశ్వవిద్యాలయం ఒక విశిష్ట వేదికగా నిలవనున్నదని అన్నారు .


ఈ విశ్వవిద్యాలయంలో ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ సైన్సెస్, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, స్పోర్ట్స్ టెక్నాలజీ, స్పోర్ట్స్ మెడిసిన్, ఫిజికల్ లిటరసీ, రీసెర్చ్, ఇన్నోవేషన్, హై-పెర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ వంటి విభాగాల్లో విద్యా, శిక్షణా, పరిశోధనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కార్యక్రమంలో వివరించారు.

ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టమవుతోందని, క్రీడలను వృత్తిగా ఎంచుకునే యువతకు నాణ్యమైన విద్య, శిక్షణ, పరిశోధన, ఉపాధి అవకాశాలను కల్పించడంలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ కీలక పాత్ర పోషించనుందని అధికారులు తెలిపారు .


ఐడీఓసీలో నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల అధికారి ఎం. పరంధామ రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారం రాథోడ్, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చంద్రమోహన్, జిల్లా విద్యాశాఖ సహాయ సంచాలకుడు శంభు ప్రసాద్, ఐటీడీఏ స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాలరావు, టీజీఎంఆర్ఎస్, టీజీఎస్ఈబ్ల్యూఆర్ఎస్ విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, విద్యాశాఖ, సంక్షేమ శాఖల అధికారులు, జిల్లాలోని ఫిజికల్ డైరెక్టర్లు YIPESU జిల్లా నోడల్ అధికారి, ఎస్‌జీఎఫ్ (SGF) కార్యదర్శి వి. నరేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాలరావు, జిల్లాలోని ఫిజికల్ డైరెక్టర్లు, టైక్వాండో కోచ్ రమేష్, కరాటే కోచ్ శ్రీధర్, అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి మహీధర్, అథ్లెటిక్స్ కోచ్‌లు మల్లిఖార్జున్, నాగేంద్ర, ఆర్చరీ కోచ్ కళ్యాణ్, రైఫిల్ షూటింగ్ కోచ్ అబ్దుల్ నబి, బాక్సింగ్ కోచ్‌లు రమేష్, శ్రీను, హాకీ కోచ్ ఇమామ్ తదితర క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333