దూదేకుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు స్వర్గీయ ఫకీర్ సాహెబ్ ఆరో వర్ధంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం 

Oct 16, 2024 - 17:21
 0  0
దూదేకుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు స్వర్గీయ ఫకీర్ సాహెబ్ ఆరో వర్ధంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం 
దూదేకుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు స్వర్గీయ ఫకీర్ సాహెబ్ ఆరో వర్ధంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం 
దూదేకుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు స్వర్గీయ ఫకీర్ సాహెబ్ ఆరో వర్ధంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం 

ఖమ్మం : దూదేకుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు స్వర్గీయ ఫకీర్ సాహెబ్ ఆరో వర్ధంతి సందర్భంగా మదర్ తెరిసా ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  రాష్ట్ర నూరు భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ భాష హాజరై మాట్లాడారు . స్వర్గీయ ఫకీర్ సాహెబ్ ఏ ఆశయాలకై సంఘాన్ని స్థాపించి పోరాడారో వారి యొక్క ఆశయాలను సాధించుటకు మేమందరం ముందు పోతామని తెలియజేశారు . యావత్ తెలంగాణ దూదేకుల కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే జరగబోయే కులగణలో దూదేకుల ప్రతి ఒక్కరూ ఇది మా కులం అని నిరూపించుకోవడానికి ముందడుగు వేయాలని సూచించారు . దూదేకులు చాలా తక్కువ శాతం ఉన్నారని తెలంగాణ గవర్నమెంట్ చూపిస్తుందని మనమెంతో మన ధమష  శాతం ఎంత రావాలో తెలియజేయుటకు ఇది మంచి అవకాశం అని మనం రాజకీయంగా , వైద్య , విద్య ఉద్యోగ పరంగా ఎదగాల్సిన అవసరం చాలా ఉందని మనమంతా ఐక్యమత్యంగా ఉండి మనకు రావాల్సిన ప్రభుత్వ ఫలాలు దక్కించుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ రహీమ్ , ఉపాధ్యక్షులు లాల్ జాన్ పాషా , రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జానీ బేగం , రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ లాల్ సాహెబ్ , జిల్లా అధ్యక్షులు రహీమ్ పాషా , జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దు పాషా , జిల్లా మహిళా అధ్యక్షురాలు సకినబి , జిల్లా నాయకులు సయ్యద్ హుస్సేన్ , జిల్లా సీనియర్ నాయకులు కార్పొరేటర్ సైదులు , జిల్లా నాయకులు హుస్సేన్ , మదర్ సాహెబ్ , సమీర్ తదితరులు పాల్గొన్నారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333