దస్తావేజుల విషయాలు
ఒక ఒప్పందం న్యాయసమ్మతం కావాలన్నా, ఒక అమ్మకం చట్టబద్దం కావాలన్నా, ఒకరు తీసుకున్న/ఇచ్చిన అప్పు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిష్కారం కావాలన్నా, ఇతరులకు మన విషయాలపై వ్యవహరించే అధికారం ఇచ్చినా, ఇద్దరు లేక ఎక్కువమంది భాగస్తులు తమ భాగఫలాన్ని వివాదం లేకుండా స్వీకరించాలన్నా, ఒక ఇంటియజమాని, అద్దెకున్నవారు తమ మధ్య కుదిరిన అద్దె విషయంలో, సదరు ఆస్తిని వినియోగించుకొనడంలో పాటించవలసిన నియమాలు, కుటుంబసభ్యులందరూ తమతమ పూర్వీకుల ఆస్తులను పరిష్కరించుకున్న తరువాత దానిపై ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా, సంపాదించిన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా తమకు కావలసిన వారికి చెందాలన్నా, ఇటువంటి విషయాలన్నీ సర్వులకూ సమన్యాయం జరిగేటట్లు, ముందుగా అనుకున్న విధంగానూ, ఆతరువాతకూడా ఆ ఒప్పందానికి విలువ ఇవ్వబడేటట్లు నమోదు చేయబడాలి. ఈ నమోదు చేసే పత్రాన్నే 'దస్తావేజు' అంటారు. ఈ దస్తావేజులు వ్రాయు వారిని 'దస్తావేజుల లేఖరి” అంటారు. ఈ దస్తావేజుల లేఖరులను డాక్యుమెంట్ రైటర్స్ అని, డ్రాఫ్ట్స్మన్ అనీ, కన్వేయనర్స్ అనీ పిలుస్తున్నారు. వీరికి ముఖ్యంగా వారు తయారుచేస్తున్న దస్తావేజుల భాష విషయంలో, న్యాయశాస్త్ర అంశాలపై చక్కని పరిజ్ఞానం ఉంటుంది. లేదంటే ఈ దస్తావేజును వ్రాయించుకున్న వారిలో ఎవరో ఒకరికి నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది. న్యాయశాస్త్ర విషయాలపై పరిజ్ఞానం, దానికి సమీపకాలంలో ఎటువంటి సవరణలు జరిగినది, ఇత్యాది విషయాలన్నీ దస్తావేజు లేఖరి కాలానుగుణంగాఅనుసరిస్తూ ఉంటారు. ఇటువంటి సమగ్రమైన అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో దస్తావేజును రచిస్తే చివరికి అది వివాదాస్పదమయి, వ్రాయించుకున్న ఇరువురిలో ఎవరో ఒకరికి ఆమోదయోగ్యం కాకుండా పోయి, వారు కోర్టుకు పోవలసి రావచ్చును.
ఈ దస్తావేజుల రచన అనేది ఒక ప్రత్యేకమైన వృత్తి విద్య. మొదట్లో ఈ దస్తావేజుల లేఖరిని 'డ్రైవర్' అని పిలిచేవారు ఈ దస్తావేజుల తయారీ ఒక విశిష్టమైన కళగా భావించబడేది. ఇది కొంతవరకు నిజం అనే భావించవచ్చు. చట్టపరమైన పరిమితులు. సూత్రాలు తెలియకుండా ఎవరూ దస్తావేజును వ్రాయలేరు. ఒకవేళ రాసినా అది చట్టానికి వ్యతిరేకంగా ఉన్నా, న్యాయసంబంధమైన సమస్యలను ప్రేరేపించేలా వున్నా కూడా ఆ
సామాజిక జీవనంలో దినదినం తటస్థపడే సంఘటన ఫలితాలన్నిటినీ విశ్లేషించి వాటిని సార్వజనీకరణం, సర్వజనామోదయోగ్యం కావించటమే చట్టం. ఈ చట్టాన్ని అమలు చేయటానికి కావలసిన యంత్రాంగం ఉంది. కాని, ప్రతి చిన్న విషయానికి చట్టం అమలును బలవంతంగా కాకుండా చట్టంపై పూర్తి అవగాహనతో దాన్ని అతిక్రమించకుండా స్వచ్చందంగా ప్రజలందరూ పాటించేలా మన సమాజం వ్యవహరించాలి. దీనికోసం ప్రాధమికంగా శాసనాలను గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిఉండాలి. నిత్యజీవితంలో జరుగు ప్రతి ముఖ్య వ్యవహారాన్నీ సంబంధించిన పత్రం ద్వారా రికార్డు చేయబడాలి. దీన్నే స్థూలంగా 'దస్తావేజు' అంటారు. ఈ దస్తావేజుల గురించి అవగాహన కలిగించడానికి ఈ పుస్తకం మీకు అందించడం జరుగుతున్నది. ప్రతి చిన్న విషయానికీ లాయరు దగ్గరకు పరుగెత్తనవసరం లేకుండా, కాస్త చదువుకున్న ప్రతి ఒక్కరూ "దస్తావేజులు వ్రాయడం" లో ప్రావీణ్యం సంపాదించుకొనవచ్చు. అందరికీ సాయపడుతూ తగినంత ఆర్థికపరమైన లాభాలు కూడా పొందవచ్చు.
కేవలం ఈ దస్తావేజు లేఖరులు ప్రభుత్వం వారు చేయు చట్టములు, వారు చేయు స్టాంపు డ్యూటీలు, రిజిస్ట్రేషను ఫీజు రేట్లు మార్పు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ. (దీనిని గురించి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోని ఎంక్వయిరీ గుమాస్తాను అడిగి తెలుసుకోవచ్చు) ఉంటే చాలు. ఈ దస్తావేజుల లేఖనం అనేది ఒక ప్రత్యేకమైన వృత్తి విద్య శాసనాలు లిఖించబడే కాలం నుంచి దస్తావేజులు వ్రాయడం అవసరమయింది.
మొదట్లో ఈ దస్తావేజుల లేఖరిని Scrivener అని పిలిచేవారు. మొదట్లో ఈ పదానికి అర్థం కేవలం Copyist అని మాత్రమే. కొందరు అమెరికన్ లాయర్లకు ఈ పదం చిన్నతనంగా అనిపించి ఈ పదానికి ముందుగా Scrivener అని కలుపుకొని వాడడం మొదలు పెట్టారు.
దస్తావేజులు రచించడంలో ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు: ఒక దస్తావేజు సాధారణంగా 7 భాగములు కలిగియుంటుంది. అవి:
1. అభివర్ణన: మామూలుగా ఒక దస్తావేజును దాని పేరుతో మొదలుపెడుతూ
ఉంటారు. ఈ పేరు నిర్ణయించేటపుడు చాలా జాగ్రత్తగా ఎన్నుకోవలసి ఉంటుంది. ఈ స్తావేజుకు పేరు నిర్ణయించేటప్పుడు దానిలోని అంశములు, ఉద్దేశ్యములను అనుసరించి ర్ణయించవలసి ఉంటుంది.
2. తేదీ: ఈ తేదీలో రెండు రకాలుంటాయి. అవి ఏమిటంటే దస్తావేజు వ్రాసిన దీ. ఇది చాలా ముఖ్యమైనది. రెండవది దస్తావేజు అమలు తేదీ. అమలు తేదీ ఏదయినా స్తావేజు వ్రాసిన తేదీ నుండి అమలులోకి వచ్చినట్లు భావించాలి.
3. దస్తావేజులకు సంబంధించిన పార్టీల పేర్లు వివరం: సాధారణంగా కొన్ని స్తావేజులు ఏకవ్యక్తి వ్రాయించుకొన్నవి అయి వుంటాయి. అవి వీలునామాలు, పవర్స్ ఫ్ అటార్నీ, బాండులు మొదలైనవి. వీటిని డీడ్పోల్ (Deed Poll) అంటారు. మరి 'న్ని పత్రములు ఉభయపార్టీలు కలిసి వ్రాయించుకుంటూ ఉంటారు. వీటిలో ముఖ్యమైనవి ద్దె అగ్రిమెంటు, భాగస్వామ్య అంగీకార పత్రం మొదలైనవి. ఎటువంటి దస్తావేజు యినా దానిలో ఉదహరించబడు పార్టీల పేర్లు సరిగాను, వివరముగాను వ్రాయాలి. "ధారణంగా పార్టీలను వారి పూర్తిపేరు, వయస్సు, తండ్రిపేరు, నివాసప్రదేశము, ఎరియు వృత్తితో కలిపి వర్ణిస్తుంటారు.
4. ఉదహరించే అంశములు: సంగ్రహ చరిత్ర అనగా దస్తావేజు ఎందుకు
యవలసి వచ్చిందో తెలుపుతూ వ్రాసే కారణములు. ఈ అంశములు సాధారణంగా ఏలననగా" అనే పదంతో ప్రారంభమై, ప్రస్తుత వ్యక్తికి లేక వ్యక్తులకు సదరు ఆస్తి పూర్వ చరిత్ర) వారికి ఏ విధంగా సంక్రమించినదీ తెలుపుతూ, దానిని ఎందుకు వరికి సంక్రమింప జేయుచున్నారో మొదలైన వివరాలు కలిగియుంటుంది.
5. టెస్టటమ్ (Testatum): దస్తావేజులోని ఈ భాగంలో ఆస్తిని ఇతరులకు ఎందుకు
సంక్రమింపజేయదలచుకున్నారో ఆ ఉద్దేశ్యమును వివరముగా పేర్కొనవలయును. మామూలుగా "ఇప్పుడు ఈ దస్తావేజు ప్రకారము" అని మొదలై సదరు ఆస్తి బదిలీకి మరియు ఇతర విషయములు ఈ విభాగంలో వివరించబడుతుంది. దీనిలో ఈ క్రింది విషయములు సామాన్యంగా వ్రాయడం జరుగుతూ ఉంటుంది.
(ఎ) క్రియాత్మక పదము: "ఒప్పుకొనుట". "మంజూరు చేయుట", "నిర్ధారణ
చేయుట", "బదిలీ చేయుట", "విక్రయించుట", "సంక్రమింపజేయుట" మొదలైన పదములు, సాధారణముగా దస్తావేజు యొక్క ముఖ్యఉద్దేశ్యమును తెలియజేస్తూ వాడవలెను:
(బి) ఆస్తిని వర్ణించుట: దస్తావేజు ద్వారా సంక్రమింపజేసే ఆస్తిని వర్ణించడంలో
చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. సాధారణంగా దస్తావేజుల చివరలో షెడ్యూలుగానో, లేకపోతే అనుబంధంగానో, సంబంధిత ఆస్తి యొక్క పూర్తి వర్ణన (రాబోయే కాలములో దానిని తేలికగా గుర్తించడానికి వీలుగా) ఆ ఆస్తికి ఉన్న హద్దులు, సర్వే నంబర్లు వ్రాయవలసి ఉంటుంది. సదరు ఆస్తికి ఆనుకొని రోడ్డుకాని, వీధిగాని ఇతర కొండగుర్తులు ఉన్నట్లయితే వాటి పేర్లు, ఆ ఆస్తిని దస్తావేజు వ్రాయుచున్న సమయంలో ఎవరైనా లీజుదారుని అధీనంలో ఉన్నట్లయితే వాని పేరు కూడా నమోదు చేయవలెను. సంబంధిత దస్తావేజుకు అట్టి ఆస్తికి సంబంధించిన ప్లాను కూడా జతపరిచి దానిని దస్తావేజులో ఒక భాగముగా ఎంచవలెను.
(సి) హేబెన్డమ్ (Habendum) : ఈ విభాగంలో దస్తావేజులోని ఆస్తిని, దానిలోని
హక్కును శాశ్వతముగా లేక జీవితకాల పర్యంతము లేక ట్రస్టుగా లేక విక్రయమవ్వగా బదిలీ చేయబడిన విషయం స్పష్టంగా వివరించబడి ఉంటుంది. సదరు ఆస్తికి ఇతరులకు ఇంతకుముందు ఎటువంటి హక్కులు కలగజేయబడి ఉన్నది. మొదలైన విషయములు, మరియు సదరు ఆస్తిమీద ఇంతకుముందు ఎటువంటి తాకట్టులు. పరాధీనములు(Encumbrances) లేకపోతే, ఆ విషయములను స్పష్టంగా ఉదహరించాలి.
(డి) ప్రత్యేకించబడిన అంశములు, మినహాయింపులు: దస్తావేజులోని ఈ విభాగంలో బదిలీ చేయబడిన ఆస్తికి సంబంధించిన అన్ని మినహాయింపులు, ప్రత్యేకించి حکامت 09
ఉంచుకున్న హక్కులు వివరంగా పేర్కొనవలెను. ఉదాహరణకు: ఒక భూమిని కౌలుకు ఇచ్చినపుడు బదిలీ చేసేవారు సంబంధిత భూమిలోని ఖనిజములు, నిధినిక్షేపములు ఏమన్నా వుంటే అవి తీసే హక్కు భూమి స్వంతదారే ఉంచుకుంటూ ఉంటారు. అటువంటి మినహాయింపులు మొదలైనవి వివరంగా దస్తావేజులోని ఈ భాగంలో. తెలియజెప్పబడతాయి.
రణ.
(ఇ) ఒప్పందములు (Covenants): ప్రతి పత్రంలో (విక్రయముగాని, కౌలుగాని, తనఖాగాని) ఉభయపార్టీలు కట్టుబడి ఉండటానికి ఉన్న షరతులు, నిబంధనలు గురించి పేర్కొనవలసిన అవసరంలేదు. కాని అటువంటి నిబంధనలకు మించి, పార్టీలు ప్రత్యేకముగా ఎటువంటి షరతులు, లేక ఒప్పందములు ఏర్పాటు చేసుకొని ఉన్నట్లయితే, వాటిని స్పష్టంగా దస్తావేజులో వ్రాసుకోవలెను.
(6) ప్రమాణ్యము (Testimonium): ఈ విభాగంలో సాధారణంగా "ఇందుకు
ప్రమాణముగా పైన పేర్కొన్న ఫలానా వ్యక్తులు, ఫలానా తేదీన, సాక్షుల సమక్షములో సంతకములు చేయడమైనది" అనే పదజాలముతో కూడుకొని ఉంటుంది. వ్రాసుకొన్నవారు, సంతకములు పెట్టి ఉన్నారన్న విషయం నిరూపిస్తుంది.
(7) సంతకములు మరియు నిరూపణలు: దస్తావేజు చివరలో వ్రాసుకొన్నవారి
సంతకములు, సాక్షి సంతకములు ఉండవలసి ఉంటుంది. వ్రాసుకొన్నవారు, సాక్షులు, వారి వారి సమక్షములో సంతకములు చేయడం అవసరం.
దస్తావేజు వ్రాయుటలో ఇతర అంశములు:
దస్తావేజు తయారు చేయుటకు ముందు, తయారు చేసేవారు సదరు దస్తావేజు వ్రాయించదలచిన వారు అందుకు తగిన అర్హతలు కలిగినవారా లేదా అనే విషయము పరిశీలించవలసి ఉంటుంది. ఉదాహరణకు మైనార్టీ తీరని వారికి దస్తావేజులు వ్రాయించడానికి గాని, ఒప్పందములు చేసుకొనుటకు గాని హక్కు లేదు. అటువంటివారి తరఫున వారి స్వతఃసిద్ధ గార్డియన్ కాని, చట్టప్రకారం నిర్ణయింపబడిన గార్డియన్గాని వ్యవహరించవచ్చు. అటువంటివారు అవసరమైతే కోర్టునుండి అనుమతి తీసుకొని దస్తావేజు రాయించాలి. హిందూ అవిభక్త కుటుంబమైతే ఆ కుటుంబము యొక్క పెద్ద తాను స్వయంగాను, మరియు సదరు హిందూ అవిభక్త కుటుంబము యొక్కమేనేజరుగాను దస్తావేజు వ్రాయించవలెను. ఇటువంటి విషయములను తెలుసుకొనిన తరువాతనే దస్తావేజు తయారుచేయవలసి ఉంటుంది.
దస్తావేజు చిత్తుప్రతి తయారైన తరువాత వ్రాయించుకొనేవారు చదువురానివారై ఉంటే, అటువంటి దస్తావేజును వారికి చదివి వినిపించి వివరించవలెను. సంతకం చేయటం కూడా ఉంటుంది కాబట్టి దానికి అవసరమైన సాక్షులు, పార్టీల సంతకములు లేక వేలిముద్రలు వేసేటపుడు, అందరూ సాక్షుల సమక్షములో ఉండవలెను. కొన్ని కొన్ని దస్తావేజులు తప్పనిసరిగా రిజిస్టరు కావలసి ఉంటుంది. దాని నిమిత్తం దస్తావేజులు వ్రాసేవారు ఇండియన్ రిజిస్ట్రేషన్ చట్టంలోని నిబంధనలను గుర్తుంచుకొని, ఏ దస్తావేజులు రిజిస్టర్ చేయాలో, అటువంటి దస్తావేజులపై సంతకములు, నిరూపణలు సబ్ రిజిస్ట్రార్ ఎదుట చేయించవలసి ఉంటుంది.
స సవా
ఆస్తిని వర్ణించే విధానం:
ఆస్తిని వర్ణించేటప్పుడు సదరు ఆస్తిని సరిగ్గా గుర్తుపట్టేందుకు వీలుగా వర్ణించవలసి వుంటుంది. పట్టణములో లేక నగరములో ఉండే ఇండ్లను వర్ణించేటప్పుడు సదరు ఆస్తులు వీధికి ఏదిక్కులో ముఖద్వారము కలిగియున్నదో, ఆ ఇంటిలోను, ప్రక్కన ప్రస్తుతము కాపురం ఉంటున్న వారి యొక్క పేర్లు ఆ యింటినంబరు తెలియజేయడం తప్పనిసరి.
సాధ్యమయినంతవరకు హద్దులను సూచించవలెను. పక్కన వేరే ఇళ్ళు. స్థలములు ఉన్నట్లయితే అవి ఉండే ప్రాంతం అంటే పేట పేరు కూడా వ్రాయాలి. వీలయితే ఆ ప్రాంతపు మునిసిపల్ లేఅవుట్ ఉన్నయెడల అది కూడా జతపరచవలెను. దస్తావేజుకు కనుక ఏదైనా మేప్ (Map) జతపరచి ఉన్నట్లయితే దాని కాపీని కూడా రిజిస్ట్రేషన్ కోసం జతపరచవలసి ఉంటుంది.
స్టాంపు డ్యూటీ:
దస్తావేజులు తయారు చేసేవారు ఇండియన్ స్టాంపు ఆక్టు నిబంధనలు క్షుణ్ణంగా తెలుసుకొని ఉండవలెను. ప్రతి దస్తావేజుపైనా నిర్ణయించబడిన రుసుము చెల్లించవలసి ఉంటుంది. సక్రమమైన స్టాంపు డ్యూటీ చెల్లింపజేసి, ప్రభుత్వాదాయానికి నష్టం కలుగకుండా చూడడమే కాక, ఎక్కువ స్టాంపులు కొని తద్వారా పార్టీలు నష్టపోకుండా చూచే బాధ్యత కూడా దస్తావేజు లేఖరిదే.
8