దండు మైసమ్మ ఆలయ నూతన ధర్మకర్తల కమిటీ ఎన్నిక

Aug 8, 2025 - 20:35
 0  7
దండు మైసమ్మ ఆలయ నూతన ధర్మకర్తల కమిటీ ఎన్నిక

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ దండు మైసమ్మ ఆలయ నూతన ధర్మకర్తల కమిటీ ఎన్నిక చైర్మన్ గా తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, 13 మంది డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం . ఆత్మకూర్ ఎస్.. ఆత్మకూరు మండలం నేమికల్లు శ్రీ దండు మైసమ్మ ఆలయ ధర్మకర్తల మండలి కమిటీ ఎన్నిక ప్రమాణస్వీకారం శుక్రవారం జరిగింది. సూర్యాపేట మార్కెట్ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి కాంగ్రెస్ నాయకులు సర్వోత్తమ్ రెడ్డి ఆలయ ధర్మకర్తల కమిటీ ప్రకటించగా ఈవో కుశలయ్య ఎంపికైన కమిటీని ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ ప్రాంగణంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ గా ఆత్మకూరు కు చెందిన తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, డైరెక్టర్లుగా నెమ్మికల్ కు చెందిన ఎరుకల సర్వయ్య జంగా బాలరాజు, మోరపాక రాజు, రేణిగుంట్ల సునీత, పుష్పాల శీను, గోపగాని లక్ష్మి, పేరం శ్రీనివాస్, కాసర్ల రామ్ రెడ్డి, వీరబోయిన రేణుక, చెరుకుపల్లి రాంబాబు, బోర రాoమల్లు, బొడ్డుపల్లి విజయలక్ష్మి, మొరుపాక లచ్చయ్య, లు ఏకగ్రీవం గా ఎంపిక కాగా శుక్రవారం ఆలయావరణంలో నిర్వహించారు. ఆలయంలో నూతన కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చైర్మన్గా ఎన్నికైన కరుణాకర్ రెడ్డి తో పాటు సభ్యులను స్థానికులు శాలువాలు పూలమాలతో సన్మానించారు.ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ నాయకులు శివ శ్రీనివాస్ జవాన్ల సత్యనారాయణ రెడ్డి ముసుగు రామచంద్ర రెడ్డి కోన అయోధ్య, పాండు నాయక్, తంగేళ్ల పెదవిరారెడ్డి, దామిటి రమేష్, రెడ్డి,కాకి లక్ష్మమ్మ, మండల మహిళా శాఖ అధ్యక్షురాలు తంగేళ్ల లక్ష్మీ, మూల ఎల్లయ్య, బిచ్చ నాయక్, రవీందర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు