దండుమైసమ్మ సన్నిధిలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు
మద్దిరాల 22 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రానికి చెందిన చిన్నపాక లింగయ్య యశోద ప్రధమ కుమారుడు మురళి స్వాతి మోక్కుబడిలో భాగంగా నిమ్మికల్ దండు మైసమ్మ సన్నిధిలో రామయ్య ఫంక్షన్ హాల్ ఘనంగా ఫాదర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం బైండ్ల భవనీయ సంఘం మండల అధ్యక్షుడు కడియం రవివర్మ (కళ)పాల్గొని ఫాదర్స్ డే సందర్భంగా కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో కడెం సోమయ్య,అనంతగిరి సుధాకర్,చిలుక శ్యామ్, కడియం రాజు,రాంపాక బాబు, చినపాక చింటూ,అనంతగిరి చెర్రీ, కడెం అమృతమ్మ, కడియం అక్కమ్మ,లక్ష్మి,చిలుక పద్మ,కడెం కలమ్మ,కడియం కృష్ణవేణి, తిమ్మిడి మానస, చిలుక మానస, మౌనిక,కడెం అంబిక,భూమిక, తదితరులు ఫాదర్స్ డే సందర్భంగా పాల్గొన్నారు.