తొండ గ్రామంలో రాస్తారోకో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం

అండర్ పాస్ నిర్మించాలి ప్రమాదాలను అరికట్టాలి
వలిగొండ తొర్రూరు దాదాపు రెండు గంటలుగా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం
తిరుమలగిరి 19 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి రోడ్డు పనులు నిలిపివేయాలంటూ రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులందరూ మాట్లాడుతూ. తుంగతుర్తి స్థానిక ఎమ్మెల్యేకు మరియు ఆర్ అండ్ బి అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు అందజేసిన ఫలితం లేదు అందుకోసం గ్రామస్తులందరం పార్టీలకు అతీతంగా అండర్ పాస్ నిర్మాణంకై పోరాడుతాం మరియు అండర్ పాస్ లేనియెడల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున గ్రామంలోని రైతులకు పాడి పశువులకు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు నెలకొంటాయని తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మా గ్రామానికి అండర్ పాస్ నిర్మించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు గ్రామస్తులు యువకులు మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు