తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం టిడిపిమండల అధ్యక్షుడు షేక్ రసూల్

Mar 29, 2025 - 19:40
 0  3
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం  టిడిపిమండల అధ్యక్షుడు షేక్ రసూల్

తెలంగాణ వార్త మాడుగుల పల్లి మార్చి 29 : ఈరోజు తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  మాడుగుల పల్లి మండలం తోపు చర్ల గ్రామం నందు మండల పార్టీ అధ్యక్షులు షేక్ రసూల్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  వేములపల్లి పిఎస్ సి ఎస్ చైర్మన్ జడ రాములు యాదవ్ హాజరై తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నందమూరి తారక రామారావు గారు పేదవారి కోసం తెలుగు జాతి కోసం తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ జెండా స్థాపించి నేటికీ 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని 43 వ సంవత్సరానికి పరుగులు తీస్తోంది తెలంగాణా లో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేక ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతోంది అయినా కూడా తెలంగాణా లో తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు యక్కడ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నారు అంటే అది ఆ నందమూరి తారక రామారావు గారి స్పూర్తి రాబోయే ఐదేళ్లలో తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు ఇట్టి కార్యక్రమంలో  మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కట్ట అనంతరెడ్డి, మాజీ సర్పంచ్ వల్లపుదాస్ యాకోబు, సీనియర్ నాయకులు రాచూరి అంజయ్య, ఎస్ టి సెల్ మండల నాయకులు హంకుడోతు గోపాల్, వేముల కాశయ్య, షేక్ అఫ్జల్, షేక్ అక్బర్, బంటు అంజయ్య, బంటు రమేష్, లడ్డు జామియా, మరియు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333