బిజ్వారం లో జియో నెట్వర్క్ రాక వినియోగదారులు కు ఇబ్బందులు

Aug 8, 2026 - 01:16
 0  1
బిజ్వారం లో జియో నెట్వర్క్ రాక వినియోగదారులు కు ఇబ్బందులు

జోగులాంబ గద్వాల ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- మల్దకల్. మండలం బిజ్వారం గ్రామంలో జియో నెట్వర్క్ రావడంలేదని వినియోగదారులు ఆరోపించారు. కరెంటు పోయిన ఇంకా ఇతర సమయాలలో నెట్వర్క్ రాక కస్టమర్లు తీవ్రఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. కస్టమర్లు  ఫిర్యాదు చేసిన జియో వర్కర్స్ పట్టించుకోవడంలేదని వర్క్ ఫ్రం హోం నిర్వహిస్తున్న ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. గత మూడు నెలల నుండి జియో నెట్వర్క్ తరచూ అంతరాయం ఏర్పడుతున్నట్లు తెలిపారు. జియో నెట్వర్క్ రాకపోవడంతో ఇతర నెట్వర్కులపై మారుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా జియో యాజమాన్యం జియో కస్టమర్లకు నెట్వర్క్ అందేలా తగు చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో మోకుమ్మడిగా జియో బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333